ఒక్కో సిమ్‌ నుంచి రోజుకు ఉచితంగా 100 సంక్షిప్త సందేశాలు

Date:04/06/2020

దిల్లీ ముచ్చట్లు:

ప్రస్తుతం ఒక్కో సిమ్‌ నుంచి రోజుకు ఉచితంగా 100 సంక్షిప్త సందేశాల (ఎస్‌ఎమ్‌ఎస్‌) వరకు పంపుకోవచ్చు.ఆపైన ఒక్కో ఎస్‌ఎంఎస్‌కు కనీసం 50 పైసల మేర ఛార్జీ విధించాలన్నది మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ ట్రాయ్‌ నిబంధన.అయితే తాజాగా ఆ నిబంధనను ట్రాయ్‌ తొలగించింది.టెలీ మార్కెటింగ్‌, అవాంఛిత వాణిజ్య సమాచారాలకు అడ్డుకట్టవేసేందుకు అప్పట్లో ట్రాయ్‌ ఆ నిర్ణయం తీసుకుంది.ఆ సమయంలో వాణిజ్యేతర వినియోగదార్లు భారీ సంఖ్యలో చేసే ఎస్‌ఎంఎస్‌లపై ఛార్జీలను విధించడానికి ఆపరేటర్లకు స్వేచ్ఛ ఉండేది.అయితే నిజమైన వాణిజ్యేతర వినియోగదార్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తాజాగా ఈ నిబంధనను తొలగించింది.ఆ మేరకు టెలికాం టారిఫ్‌ ఆదేశాలు-2012లోని ఆ ప్రత్యేక నిబంధనను తొలగిస్తూ సవరణ చేసింది.ట్రాయ్‌ నిర్వహించిన తొలి దృశ్యమాధ్యమ సమావేశం ద్వారా జరిగిన బహిరంగ చర్చ (ఓహెచ్‌డీ) అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.ఇక అవాంఛిత ఎస్‌ఎంఎస్‌ల విషయంలో 2018లోనే ఒక సరికొత్త, బలమైన సాంకేతికతతో ఒక వ్యవస్థను తీసుకొచ్చిన విషయాన్ని ట్రాయ్‌ గుర్తు చేసింది.

పరారీలో ఉన్న ప్రముఖ లిక్కర్‌ వ్యాపారి విజయ్‌ మాల్యా కథ క్లైమాక్స్‌కు చేరింది.

Tags: 100 short messages per day from each SIM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *