మండిపల్లి భవన్ లో ఘనంగా 101వ జయంతి వేడుకలు

రాయచోటి ముచ్చట్లు:

 

పత్రికా ప్రచురణార్థం.పేద, బడుగుబలహీనవర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్: మండిపల్లి•విశ్వ విఖ్యాత నటసార్వభౌమ బిరుదు ఆయనకే సొంతం.•మండిపల్లి భవన్ లో ఘనంగా 101వ జయంతి వేడుకలు.రాయచోటి న్యూస్ : పేద, బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతూ, తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహానీయుడు నందమూరి తారక రామారావు అని రాయచోటి టిడిపి అభ్యర్థి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి కొనియాడారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగువారి అభిమాన నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా రాయచోటిలోని మండిపల్లి భవన్ లో యన్టీఆర్ చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా రామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీని స్థాపించి, తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదంతో కేవలం 6 నెలల్లో అధికారంలోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్ దేనని, పేద ప్రజల కోసం దేశంలోనే తొలిసారిగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని, రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని ప్రవేశ పెట్టడం, పూర్తి మద్యపాన నిషేధం వంటి బృహత్తరమైన కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించడం జరిగిందని, జాతీయ రాజకీయాలను సైతం సరికొత్త దిశా నిర్దేశం చేశారని. సంక్షేమ పథకాలతో సమ సమాజ స్థాపన కోసం ఎన్టీఆర్ బాటలు వేశారన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం మనమందరం పాటుపడుతూ, జరిగిన ఎన్నికలలో చంద్రబాబును ముఖ్యమంత్రి అవుతున్నారని, టిడిపి కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డితో పాటు, గాజులు ఖాదర్బాషా ఖాదర్ బాష, రవీంద్రారెడ్డి, ఖాదర్ మోహిద్దీన్, ఇర్షాద్, జావిద్, శివా రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, తదీతరులు పాల్గొన్నారు.

 

Tags:101st birthday celebrations at Mandipalli Bhavan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *