104, 108 Distribution of goods to the staff

104, 108 సిబ్బందికి సరుకులు పంపిణీ

Date:23/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని వైఎస్‌ఆర్‌సీపీ ముస్లిం మైనార్టీల నాయకుడు , కౌన్సిలర్‌ అభ్యర్థి అర్షద్‌అలి ఆధ్వర్యంలో 104, 108 సిబ్బందికి సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, కౌన్సిలర్‌ అభ్యర్థి త్యాగరాజు, యువజన సంఘ నాయకులు చెంగారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, అఫ్సర్, బిలాల్‌ హాజరైయ్యారు. ఈ సందర్భంగా సిబ్బందికి బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. షరీఫ్‌ మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో ప్రజలను ఆదుకుంటున్న 108, 104 సిబ్బందికి సరుకులు పంపిణీ చేసే అవకాశం లభించడం ఎంతో అదృష్టమన్నారు. ఇలాంటి కార్యక్రమాలను మరింతగా చేపట్టాలని కరోనా నియంత్రణను అరికట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో  నౌజవాన్‌ కమిటి సభ్యులు పాల్గొన్నారు.

అందుబాటులో కూరగాయలు

Tags: 104, 108 Distribution of goods to the staff

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *