105 shops set up by YSR

వైఎస్‌ఆర్‌ చేయూత ద్వారా 105 షాపులు ఏర్పాటు

– కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Date:25/09/2020

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్‌ఆర్‌ చేయూత పథకం క్రింద మున్సిపాలిటి పరిధిలో 105 మంది మహిళా సంఘాల సభ్యులు వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. శుక్రవారం ఐకెపి కోఆర్డినేటర్‌ రవికుమార్‌ ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ చేయూత అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమిషనర్‌ , మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం అతిధులుగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా ఒకొక్క మహిళకు రూ.18,750లు ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. అలా లబ్ధిపొందిన వారికి అధనంగా లక్షరూపాయలు ఆర్థిక సహాయం బ్యాంకుల ద్వారా అందిస్తున్నామన్నారు. మహిళలు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను హెచ్‌సిఎల్‌ కంపెనీ వారిచే కొనుగోలు చేయించేందుకు మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చర్యలు తీసుకున్నారని తెలిపారు. మహిళలు తయారు చేసిన వస్తువులను విక్రయించేందుకు చర్యలు తీసుకుంటామని , మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే ప్రభుత్వ ఆశయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్‌ , మహిళలు పాల్గొన్నారు.

మహిళలకు హానికలిగిస్తే శిక్షార్హులు

Tags: 105 shops set up by YSR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *