మన బడి కింద నెల్లూరులో 1061 పాఠశాలలు

Date:15/11/2019

నెల్లూరు ముచ్చట్లు:

మనబడి నాడు- నేడు’ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.కోట్లు ఖర్చుపెట్టామని గత ప్రభుత్వాలు ప్రకటించినా అనేక పాఠశాలల్లో కనీసం మరుగుదొడ్లు, మంచినీరు, బ్లాక్‌ బోర్డులాంటి కనీస వసతులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టడడం అభినందనీయమైనా ఏమేరకు అమలుచేస్తారో చూడాలి. జిల్లాలో వ్యాపితంగా 4,350 పాఠశాలలు ఉన్నాయి. తొలివిడతలో 1,061 పాఠశాలలను ఎంపిక చేశారు. అందుకోసం రూ.101 కోట్లు నిధులు కేటాయించారు. మార్చిలోపు ఈ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే నాటి పాఠశాల స్థితిని ఫొటోలు తీశారు. మార్చినాటికి నేటి స్థితిని ఆన్‌లైన్‌లో పెట్టాలని ప్రభుత్వం చూస్తుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం  మనబడి నాడు-నేడును ప్రారంభిస్తుంది. జిల్లావ్యాప్తంగా 4,350 వరకు ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలున్నాయి. ఎన్నో ఏళ్లు గడుస్తున్నా పాఠశాలల్లో కనీస వసతుల్లేవు. కనీసం బ్లాక్‌బోర్డులు లేని పాఠశాలలు కోకోల్లు. గత ప్రభుత్వ కాలంలో విద్యా కమిటీలు ఏర్పాటుచేసినా అభివృద్ధి కన్నా రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మనబడిని మార్చడానికి అక్కడ వసతులు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధమంటుంది. పాఠశాలల్లో తొమ్మిది రకాల వసతులు కల్పించనుంది. మరుగుదొడ్లు, ప్రహరీ, మంచినీరు, ఫ్యాన్లు, విద్యుత్‌, బెంచీలు, బ్లాక్‌బోర్డు, తదితర వసతులు కల్పిస్తామని చెబుతుంది. తొలివిడతగా 1061 పాఠశాలలకు రూ.101 కోట్లు కేటాయించింది. పాఠశాలకు 10 రూపాయలు కేటాయిస్తున్నారు. ఇప్పటికే ఆయా పాఠశాలల స్థితి గురించి కాంప్లెక్స్‌ రిసోర్సు పర్సన్‌ (సిఆర్‌పి) ద్వారా ఫొటోలు తీయించారు. మార్చి నాటికి ఈ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని చెబుతుంది. ఇది సాధ్యమేనా అనే అనుమానాలున్నాయి. పాఠశాలలకు ప్రహరీ అంటే కనీసం రూ.10 నుంచి రూ.15 లక్షలు ఖర్చు అవుతుంది.

 

 

 

 

 

 

 

 

మరుగుదొడ్లుంటే కనీసం విద్యార్థినీ, విద్యార్థులకు రూ.2 లక్షలు, బెంచ్‌లు కావాలన్నా భారీ బడ్జెట్‌కావాల్సిందే. ప్రభుత్వం ఇస్తున్న ఈ నిధులతో అన్ని మౌలిక వసతులు కల్పించడం సాధ్యం కాదని తెలుస్తోంది.పాఠశాలల్లోని సమస్యలకు ఒకటో, రెండు పరిష్కారం కానుంది. మార్చినాటికి పాఠశాలల రూపు రేఖలు మార్చుతామని ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఏం చేస్తుందో చూడాల్సి ఉంది. రాజీవ్‌ విద్యా మిషన్‌ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణాలు జరిగినా మంచినీటి సదుపాయాలు లేక మూలనపడ్డాయి. కొన్ని సూళ్లకు అసలు మరుగుదొడ్లే లేవు. ఉప రాష్ల్రపతి ఎం.వెంకయ్యనాయుడు సొంత మండలం కసుమూరు ఉన్నత పాఠశాలల్లో మూడేళ్ల నుంచి మరుగుదొడ్లు లేక అవస్థలు పడుతున్నారు. స్వయంగా అప్పటి మంత్రి చెప్పినా కార్యరూపం దాల్చలేదు. మూడు వందల మంది అమ్మాయిలున్న ఈ పాఠశాలలో వాటర్‌ ప్యాకెట్లు ఉపయోగించి మలవిసర్జన కోసం వెళుతున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. బ్లాక్‌బోర్డులు చాక్‌పీసుల కోసం దాతలను ఆశ్రయించాల్సిన స్థితిలో అనేక పాఠశాలలున్నాయి. ప్రహరీలేని పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. కనీసం 10 శాతం పాఠశాలకు ఫ్యాన్లు లేవంటే ఆతిశయోక్తి కాదు. ఫ్యా,న్లు, లైట్లు ఉపయోగిస్తే విద్యుత్‌ బిల్లులు చెల్లింపుల పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మినరల్‌ వాటర్‌ను వినియోగిస్తున్నారు. పాఠశాలల్లో కనీసం కుళాయి కనెక్షన్లు లేవు. కొన్ని చోట్ల ఉపాద్యాయులు, విద్యార్థులు చందాలేసుకొని నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితులున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించకుండా విద్యార్థులు, తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల పట్ల అశ్రద్ధకలిగేలా తయారుచేసి, ప్రయివేటు పాఠశాలల ముందు క్యూ కట్టెలా ప్రభుత్వ విధానాలున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు అంటనే అంతేలే అన్నట్లు తయారు చేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశపడుతున్నారు.

 

యాక్టివ్ గా మాజీ మంత్రి అఖిలప్రియ

 

Tags:1061 schools in Nellore under our school

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *