108 పాటల జపమాల కార్యక్రమం

పీలేరు  ముచ్చట్లు:
 
చిత్తూరు జిల్లా, పీలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం తిరుపతి మన సంస్కృతి కళా సంస్థ ఆధ్వర్యంలో 108 పాటల జపమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 11వ అదనపు జిల్లా జడ్జి వి.నరేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతరించిపోతున్న మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను రక్షించుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.మన సంగీతాన్ని, జానపద కళలను పరిరక్షించుకొని మన ముందు తరాలకి ఇవ్వాలని అని అన్నారు. పీలేరు అర్బన్ సిఐ మోహన్ రెడ్డి మాట్లాడుతూ మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను విదేశీయులు ఆదరిస్తూ ఉంటే, మనం మాత్రం పాశ్చాత్య సంస్కృతి, సంప్రదాయాల వైపు మొగ్గు చూపడం బాధాకరమని అన్నారు. అనంతరం అనంతపురం, కడప, చిత్తూరు జిల్లా నుండి పాల్గొన్న గాయనీ గాయకులు భక్తి, జానపద, అభ్యుదయ, దేశభక్తి , పల్లె పాటలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో మన సంస్కృతి కళా సంస్థ ప్రధాన కార్యదర్శి కలకట రెడ్డప్ప, కార్యక్రమ నిర్వాహకులు కళాకారుడు బండి ఈశ్వర్, సామాజిక సేవకుడు జానం గంగిరెడ్డి, బహుభాషా కళాకారుడు ‘ఆల్ ది బెస్ట్’ ఖాదర్ బాష షేక్, గిరిజన యానాది నాయకులు శ్రీనివాసులు, కల్లూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోకల తాతయ్య, డాక్టర్ పి.వి.ఎస్. లక్ష్మి, సీనియర్ అడ్వకేట్ రాయల సుధాకర్ రాయలు, తెలుగు భాషా కమిటీ అధ్యక్షులు జలకనూరి మురళీధర్ రాజు, ఈ టీవీ పాడుతా తీయగా గాయకుడు దిగళా మోహన్ రాజు, రాయచోటి వీరభద్ర స్వామి ఆలయ భజన గురువు తుమ్మల హరినాథ్, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల నుంచి అనేక మంది గాయనీ, గాయకులు పాల్గొన్నారు.
 
Tags: 108 song rosary program

Leave A Reply

Your email address will not be published.