పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి

-మే 24 నుంచి జూన్ 3వ వతేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు

-పరీక్ష కేంద్రాలలో ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

-జిల్లాలో 23 కేంద్రాలలో 5338 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరు

-డిఆర్ఓ సత్యనారాయణ రావు

రాయచోటి ముచ్చట్లు:

జిల్లాలో ఈ నెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు ప్రశాంత వాతావరణంలో పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించాలని డిఆర్ఓ సత్యనారాయణ రావు విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ మరియు పరీక్షా కేంద్రాలలో చేయవలసిన ముందస్తు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ యం. అభిషిక్త్ కిషోర్ ఆదేశాల మేరకు బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో డిఆర్ఓ సత్యనారాయణ రావు సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ… అన్నమయ్య జిల్లాలో 23 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 5338 మంది విద్యార్థులు పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలు రాయడం జరుగుతుందన్నారు. ఉదయం 9:30 నుంచి 12:45 గంటల వరకు పరీక్ష నిర్వహించాలన్నారు. 9 గంటల 30 నిమిషాల తర్వాత వచ్చిన విద్యార్థినీ విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు అనుమతించబడరని, కావున పరీక్షకు హాజరవు విద్యార్థిని విద్యార్థులు నిర్ణీత సమయంలో గా పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సిందిగా సూచించారు.

 

 

 

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరీక్షా కేంద్రాలలో ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలన్నారు. పదవ తరగతి ప్రశ్నాపత్రాలను భద్రపరిచిన స్టోరేజ్ పాయింట్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని సూచించారు. అలాగే పరీక్షలు జరిగే రోజు పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాలలో జిరాక్స్ సెంటర్లు మూసి వేయాలని, 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రానికి ఎటువంటి సందర్భంలో కూడా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ (electronic devices) లేదా మొబైల్ ఫోన్స్ అనుమతించబడవు. కావున విద్యార్థిని విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఎటువంటి సందర్భంలో మొబైల్ ఫోన్స్ తీసుకొని రాకూడదని పేర్కొన్నారు. విద్యార్థులు ఎటువంటి స్లిప్పులు గాని,ఏ ఇతర వస్తువులు గాని తీసుకొని రాకూడదని,

 

 

 

కాపీయింగ్ పూర్తిగా అరికట్టాలన్నారు. పరీక్షా కేంద్రంలో ఎవరైనా విద్యార్థిని విద్యార్థులు అస్వస్థతకు గురైన యెడల ప్రాథమిక చికిత్స అందించేలా కేంద్రంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని కోరారు. అలాగే పదవ తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అధికారులతో పేర్కొన్నారు.ఈ సమావేశంలో డీఈవో, పోలీస్, రెవెన్యూ, ఆర్టీసీ, మెడికల్, ఆర్టీసీ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Tags:10th Class Supplementary Examinations should be conducted in a peaceful environment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *