పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని సాయిబాబాగుడి వద్ద ఎదురెదురుగా రెండు ఆటోలు ఢీకొనడం, ఈ సమయంలో ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో 11 మంది గాయపడిన సంఘటన గురువారం సాయంత్రం జరిగింది. మండలంలోని ఏడూరు గ్రామానికి ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న ఆటో అతివేగంగా వచ్చి ఢీకొనడం, అదే సమయంలో పెంచుపల్లికి చెందిన గోపినాథ్ ద్విచక్రవాహనంను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడూరు గ్రామానికి చెందిన మమత, రమణమ్మ, నీలావతి, ఈశ్వరమ్మ, సుప్రియ, కళావతి, అన్వేష్ , డ్రైవర్ జీవరత్న లకు తీవ్ర గాయాలైయ్యాయి. ద్విచక్రవాహనంలో వస్తున్న పెంచుపల్లికి చెందిన గోపినాథ్ , అతని భార్య అఖిల , కొడుకు దేవాంష్‌లు గాయపడ్డారు. వీరిని స్థానికులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Tags: 11 injured in two auto collision