తిరగబడ్డ తులాభారం.. శశిధరూర్ కు 11 కుట్లు

Date:15/04/2019
 తిరువనంతపురం ముచ్చట్లు :
తులాభారం కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకోవడంతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన తలకు 11 కుట్లు పడ్డాయి. కేరళ రాజధాని తిరువనంతపురంలోని తంపనూర్ ప్రాంతంలోని ఓ ఆలయంలో సోమవారం  ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. కేరళీయులు సోమవారం తమ కొత్త సంవత్సరాది ‘విషు’ పర్వదినాన్ని జరుపుకొంటున్నారు. ఈ వేడుకల్లో భాగంగా శశిథరూర్ స్థానిక గాంధారి అమ్మన్‌ కోవిళ్‌ ఆలయాన్ని సందర్శించారు.ఆలయంలో శశిథరూర్‌కు తులాభారం నిర్వహిస్తుండగా త్రాసు ఒక్కసారిగా తెగిపడంది. శశిథరూర్ కిందపడిపోగా.. త్రాసు వేలాడదీసిన ఇనుప రాడ్డు ఆయన తలపై పడింది. దీంతో థరూర్ తలకు తీవ్ర గాయమైంది. అప్రమత్తమైన ఆలయ సిబ్బంది ఆయణ్ని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శశిథరూర్‌ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఆయనకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించామని.. ఆయన తలకు 11 కుట్లు వేశామని తెలిపారు. థరూర్ కాలికి కూడా స్వల్ప గాయమైనట్లు చెప్పారు. తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి థరూర్ ఇప్పటికే వరసగా రెండు సార్లు ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఈ స్థానం నుంచి మరోసారి గెలిచి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేయాలని భావిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి కుమ్మనం రాజశేఖరన్‌, సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థి దివకరణ్‌‌తో.. థరూర్‌ పోటీపడనున్నారు. ఏప్రిల్‌ 23న ఈ ఎన్నికల పోలింగ్ జరగనుంది.సోమవారం మధ్యాహ్నం తిరువనంతపురం నియోజకవర్గానికి సంబంధించిన మేనిఫెస్టో విడుదల చేయాలని శశిథరూర్ భావించారు. ఆలయంలో జరిగిన ఘటనతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు.
Tags:11 stitches for shivadrarur ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *