Natyam ad

జిహెచ్ఎంసి పరిధిలో 11, 700 వందల ఇండ్ల పంపిణీ కార్యక్రమం

హైదరాబాద్ ముచ్చట్లు:


బహదూర్ పల్లి లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  పాల్గోని ప్రారంభించారు.  ఈకార్యక్రమానికి   ఎమ్మెల్యేలు వివేకానంద, మాధవరం కృష్ణారావు జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్, కలెక్టర్ అనుదీప్ తదితరులు హజరయ్యారు. కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో డి- పోచంపల్లి, గాజులరామరం, బహదూర్ పల్లి కలిపి 17 వందల ఇండ్ల పంపిణీ జరిగింది.మరోవైపు, మాకు ఇళ్లు రాలేదంటూ పెద్ద ఎత్తున దరఖాస్తు దారులు  ఆందోళనకు దిగారు. ఒక వైపు సభ నడుస్తుంటే మరోవైపు స్థానిక నేతలు డబుల్ బెడ్ రూం లు వారికి కావాల్సిన వాళ్ళకి మంజూరు చేశారని ఆందోళన చేసారు. ఈ నేపధ్యంలో  పోలీసులకు,లబ్ది దారులకు మధ్య తోపులాట జరిగింది.

 

Tags: 11,700 hundred houses distribution program under GHMC

Post Midle
Post Midle