12 రోజులు మున్సిపాలిటిలో స్వచ్చతేసేవా కార్యక్రమాలు

12 days in the municipality

12 days in the municipality

– కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Date:18/09/2018

పుంగనూరు ముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మున్సిపాలిటిలో స్వచ్చభారత్‌ మిషన్‌ క్రింద స్వచ్చాంధ్ర స్వచ్చతేసేవా కార్యక్రమాలు 12 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. మంగళవారం ఆయన పట్టణంలోని పలు ప్రాంతాలలో స్వచ్చతేసేవా కార్యక్రమాలలో బాగంగా పారిశుద్ద్య కార్యక్రమాలు చేపట్టారు.

 

అలాగే పట్టణంలోని మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు, మున్సిపల్‌ కార్మికులకు ఆయన తగు సూచనలు, సలహాలు వివరించారు. కమిషనర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న స్వచ్చతేసేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారన్నారు.

 

 

ఇందులో భాగంగా ఈనెల 30 వరకు ఈ పనులను 24 వార్డుల్లోను చేపడుతామన్నారు. అన్ని పాఠశాలలు, అన్నికార్యాలయాల వద్ద ఆరోగ్యం, చేతులు కడుగుట గూర్చి వివరిస్తామన్నారు. అలాగే ప్రజలు తడిచెత్త, పొడిచెత్తను వేరుచేసే విధానాన్ని వివరిస్తామన్నారు. ప్రతి వార్డులోను 100 మంది వార్డు ప్రజలతో కలసి శ్రమదానంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపటడం నిర్వహిస్తామన్నారు.

 

 

అన్ని ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలల విద్యార్థులచే స్వచ్చతేసేవా కార్యక్రమాలపై ర్యాలీలు , అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాలలో పాలకవర్గంతో సహా పట్టణ ప్రజలు , అధికారులు భాగస్వామ్యులై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఈఈ వెంకటప్రసాద్‌, ఏఈ క్రిష్ణకుమార్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్‌ తదితరులు పాల్గొన్నారు.

విషజ్వరాల పట్ల ప్రజలకు అవగాహన

Tags: 12 days in the municipality

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *