12 lakh crore bribe ... Additional Collector found in the crosshairs

 కోటి 12 లక్షల లంచం…అడ్డంగా దొరికిన అడిషనల్ కలెక్టర్

Date:09/09/2020

మెదక్   ముచ్చట్లు:

మెదక్ మాచవరం లో లక్ష రూపాయల నగదు తో పాటు హైదరాబాద్ బోయినపల్లి లో లాకర్ ను గుర్తించారు ఏసీబీ అధికారులు. సాయంత్రం వరకు సోదాలు నిర్వహించారు.మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులకు దిగారు. భూవివాదం కింద నగేష్ కోటి 12 లక్షల రూపాయల లంచం తీసుకుంటున్నట్లు ఏసీబీకి సమాచారం అందింది. చెక్కుతో పాటు ప్రాపర్టీ అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఉదయం నుంచి ఈ సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ రావు ఆధ్వర్యంలో సిబ్బంది ఇంట్లో క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.ఆడియో క్లిప్‌లతో సహా నగేష్ పట్టుబడినట్లు సమాచారం. లంచంగా ఆయన కోటి 12 లక్షల నగదు, కోటి రూపాయల ప్రాపర్టీ రాయించుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని ఇతర ఆస్తులపై కూడా విచారణ మొదలైంది. ఏసీబీ సోదాల్లో సీఐలు ఫయాజ్, గంగాధర్, ఎస్ఐలు మజీద్ అలీ ఖాన్, నాగేంద్ర బాబు, రామలింగారెడ్డి, శంకర్ రెడ్డి, శ్రీధర్ తదితరులు ఉన్నారు..నర్సపూర్ మండలము చిప్పల్ తుర్తి గ్రామ గ్రామంలో ఒక కోటి 12 లక్షలకు డీల్ కుదిరింది. ఎకరానికి 1లక్ష రూపాయలకు ఒప్పందం కుదర్చుకున్నారు. 15 రోజులుగా పనికాకపోవడంతో ఎన్వోసీ ఇవ్వకపోవడంతో చివరకు ఏసీబీని ఆశ్రయించారు. హైదరాబాద్‌కు చెందిన మూర్తి అనే వ్యక్తి ఏసీబీ అధికారుల్ని కలిశారు. మెదక్ మాచవరం లో లక్ష రూపాయల నగదు తో పాటు హైదరాబాద్ బోయినపల్లి లో లాకర్ ను కూడా అధికారులు గుర్తించారు.

 

సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్తా..

Tags:12 lakh crore bribe … Additional Collector found in the crosshairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *