Natyam ad

ఓనమ్ రోజున 120 కోట్ల లిక్కర్ సేల్స్

తిరువనంతపురం ముచ్చట్లు:

 

కేరళ రాష్ట్రానికి అతిపెద్ద పండగ ఓనం. తెలంగాణకు దసరా, ఆంధ్రప్రదేశ్ కు సంక్రాంతి ఎలాగో.. కేరళకు ఓనం అలాంటి పెద్ద పండగ. ఓనం వేడుకలు కేరళ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రత్యేక క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఓనం పండగ వేళ సాధారణంగానే మద్యం అమ్మకాలు జోరుగా సాగుతాయి. ఈ సంవత్సరం మాత్రం లిక్కర్ సేల్స్ రికార్డులు బద్దలు కొట్టాయి. కొన్ని రోజుల వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఆదాయం వచ్చి పడింది. సర్కారు ఖజానాకు మందుబాబులు కిక్కెక్కించారు. అతిపెద్ద పండగ వేళ అత్యధికంగా తాగేశారు. 10 రోజుల లిక్కర్ సేల్స్ ఏకంగా భారీ  ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. కేరళ రాష్ట్ర బేవరేజ్ కార్పొరేషన్ డేటా ప్రకారం.. పండగ సందర్భంగా 10 రోజుల వ్యవధిలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. సుమారు రూ.759 కోట్ల విలువైన లిక్కర్ అమ్ముడుపోయింది. అలాగే 2023 ఆగస్టులో కేరళ వ్యాప్తంగా రూ.1,799 కోట్ల విలువైన లిక్కర్ సేల్స్ జరిగినట్లు డేటా చెబుతోంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి 8.5 శాతం మద్యం అమ్మకాలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఓనం పండగ ఉత్రాదం రోజున రూ.116 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.

 

 

 

Post Midle

నిధులు లేక అల్లాడుతున్న కేరళ రాష్ట్ర సర్కారుకు ఓనం పండగ మద్యం అమ్మకాలు ఆదుకున్నాయనే చెప్పాలి. కేరళకు చెందిన ప్రముఖ రమ్ బ్రాండ్ ‘జవాన్’ 10 రోజుల్లో 70 వేల కేసులు అమ్ముడైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో మొత్తంగా 269 మద్యం విక్రయ కేంద్రాలు ఉన్నాయి. అందులో మలప్పురం జిల్లాలోని తిరూర్ లోని బెవ్‌కో ఔట్‌లెట్‌ ఒకటి. ఈ మద్యం విక్రయ కేంద్రంలో అత్యధిక అమ్మకాలు జరిగాయి. త్రిసూర్ జిల్లాలోని ఇరింజలకుడ రెండో స్థానంలో నిలిచింది. అలాగే ఓనంకు ఒక్క రోజు ముందు అత్యధికంగా మద్యం అమ్మకాలు జరిగాయి. బెవ్‌కో ఔట్‌లెట్‌ ల నుంచి రూ.120 కోట్ల విలువైన మద్యాన్ని 6 లక్షల మందికి పైగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇరింజలకుడ ఔట్‌లెట్‌ లో సోమవారం అత్యధికంగా రూ.1.06 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. పాతాళలోకాధిపతి అయిన బలిచక్రవర్తిని భూమిపైకి ఆహ్వానిస్తూ పది రోజుల పాటూ జరుపుకునే పండుగ ఇది. మహాబలి పాలించిన సమయం మళయాలీలకు స్వర్ణ యుగంతో సమానం.

 

 

 

బలిచక్రవర్తి పాలనలో రాజ్యంలో ప్రజలంతా సుఖశాంతులతో, సిరిసంపదలతో వర్థిల్లారని చెబుతారు. అందుకే రాక్షస రాజు అయినప్పటికీ బలిచక్రవర్తిని గౌరవించేవారు. అందుకే బలిచక్రవర్తితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పదిరోజుల పాటూ మహాబలిని పాతళలోకం నుంచి భూమ్మీదకు అహ్వానిస్తూ జరుపుకునే ఓనం జరుపుకుంటారు. ఇదే వేడుగను కొన్ని రాష్ట్రాల్లో వామన జయంతిగా జరుపుకుంటారు. ఏటా పది రోజుల పాటూ ఓనం వైభవం చూడడానికి రెండు కళ్లు సరిపోవు. మొదటి రోజును అతమ్‌గా, చివరి రోజైన పదోరోజును తిరు ఓనమ్ అని అంటారు. పది రోజుల పండుగలో ఈ రెండు రోజులూ చాలా ముఖ్యమని భావిస్తారు కేరళీయులు. కేరళ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే ఓనంకు 1961 లో  జాతీయ పండగగా గుర్తింపు లభించింది. ఈ ఏడాది ఆగస్టు 20  అతమ్ ఆగష్టు 29 న తిరు ఓనమ్.

 

Tags: 120 crore liquor sales on Onam day

Post Midle