సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి

శ్రీకాళహస్తి ముచ్చట్లు:
 
సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి పురస్కరించుకొని జై భీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు పులిశ్రీకాంత్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పులి శ్రీకాంత్ మాట్లాడుతూనేతాజి సుభాష్ చంద్రబోస్ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తారన్నారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఎంతో చురుకైన పాత్ర పోషించి రాజీలేని పోరాటం చేశారన్నారు. నేతాజి చూపిన మార్గంలో యువత పయనించాలన్నారు. ఆయన ఆశయాల సాధమే నిజమైన నివాళులన్నారు. ఈ కార్యక్రమంలో బషీర్, కన్నలి రమేష్, దారా పాండు, పసల ప్రసాద్, సాధు భాస్కర్, పసల కుమార్ , శివారెడ్డి, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: 125th birth anniversary of Subhash Chandra Bose

Natyam ad