Natyam ad

ఫుట్ బాల్ మైదానంలో తొక్కిసలాట..127 మంది దుర్మణం..

జకర్తా ముచ్చట్లు:

ఫుట్‌బాల్‌ మైదానంలో తొక్కిసలాట జరిగి 127 మంది దుర్మరణం పాలైన సంఘటన ఇండోనేషియాలో జరిగింది. తూర్పు జావా ప్రావిన్స్‌లో శనివారం రాత్రి నిర్వహించిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ సందర్భంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. మరో 180 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పెర్సెబాయ సురబాయ జట్టు చేతిలో అరెమా జట్టు ఓడిపోయింది. ఈ క్రమంలో ఇరుజట్ల అభిమానులు ఘర్షణకు దిగారు. ఓటమి భరించలేక మైదానంలోకి చొచ్చుకొచ్చి గొడవకు దిగారు.
ఆందోళనకారులను నియంత్రించేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ ప్రయోగించి లాఠీఛార్జ్‌ చేశారు. ఈ ఘటనపై ఇండోనేషియన్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ దర్యాప్తునకు ఆదేశించింది.

Post Midle
Post Midle