12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలి

పుంగనూరుముచ్చట్లు:

 

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీని ఏర్పాటు చేసి ఐఆర్‌ ప్రకటించాలని విశ్రాంత ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం విశ్రాంత ఉద్యోగుల భవనంలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పెన్షనర్లకు డీఆర్‌, పీఆర్సీ బకాయిలు చెల్లించాలని , అదనపు పెన్షన్‌ గతంలో ఇచ్చిన విధంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వీటిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సంఘ ప్రతినిదులు రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Tags: 12th PRC should be established

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *