జమ్మూకశ్మీర్‌లో లోయలోకి పడిన బస్ 13 మంది మృతి 

13 killed in bus in Jammu

13 killed in bus in Jammu

Date:14/09/2018
శ్రీనగర్‌ ముచ్చట్లు:
కాశ్మీర్ లోని కిష్త్వార్ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో13 మంది మృతి చెందారు. అదుపు తప్పిన మినీ బస్సు ఒకటి  లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది చనిపోగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు రాజిందర్ గుప్తా అందించిన సమాచారం  ప్రకారం  కాశ్వాన్ నుంచి కిష్త్వార్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మినీ బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం చీనాబ్ నది సమీపంలో 300 అడుగుల లోతు లోయలోకి పడిపోయింది.
బస్సులో మొత్తం  30 మంది ప్రయాణికులున్నారు.సహాయక చర్యులు కొనసాగుతున్నాయని, గాయపడిన వారిని  హెలికాప్టర ద్వారా ఆసుపత్రులకు తరలించే ఏర్పాటు చేస్తున్నామని కిష్త్వార్ డిప్యూటీ కమిషనర్ అంగ్రేజ్ సింగ్ రాణా ప్రకటించారు.
అలాగే ఈ ప్రమాంలో చనిపోయినవారికి 5 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50 వేల రూపాయల పరిహారాన్నిప్రకటించారు.  అటు ఈ ఘోర ప్రమాదంపై పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ చీఫ్‌, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, జమ్మూ కాశ్మీర్ ట్రాన్స్‌పోర్టేషన్ కమిషనర్ ఎస్పీ వాయిద్‌ ట్విటర్‌లో సంతాపం తెలిపారు.
Tags:13 killed in bus in Jammu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *