సిమ్లాలో ఘోర రోడ్డు ప్రమాదం13 మంది మృతి

13 killed in road accident in Shimla
Date:22/09/2018
సిమ్లా ముచ్చట్లు:
హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో13 మంది మృతి చెందారు. ప్రయాణికులతో వెళ్తున్న ఓ జీపు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు మహిళలు కూడా ఉన్నారు.
ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను చేపట్టారు. క్షతగాత్రుల్లో ఓ చిన్నారి కూడా ఉంది.
వారిని సిమ్లాలోని రోహ్రు హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ ప్రమాదంలో జీపు నుజ్జునుజ్జయ్యింది. ఘటనా స్థలంలోనే పది మంది చనిపోగా.. ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో మార్గమధ్యలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు.
స్నాలి ప్రాంతానికి సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఏడాది హిమాచల్‌ప్రదేశ్‌లో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కులు ప్రాంతంలో గత నెల 23న కారు కొండమీద నుంచి లోయలో పడిపోవడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్ నెలలో బస్సు లోయలో పడిపోవడంతో 27 మంది చిన్నారులు తమ ప్రాణాలను కోల్పోయారు.
Tags:13 killed in road accident in Shimla