బి కొత్తకోట ముచ్చట్లు:
నవ భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 133వ జయంతిని బి కొత్తకోట జ్యోతి చౌక్ నందు ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి బానిసంచ పేల్చి స్వీట్లు పంచి వేడుకగా జరుపుకున్నారు. అదేవిధంగా బాస్ మండల అధ్యక్షుడు పలక వెంకటేష్ మాట్లాడుతూ మన దేశానికి ఒక దిశా నిర్దేశాన్ని, మన పౌరులందరికి చట్టబద్ధ జీవనాన్ని, మన మహిళలకు సమాన హక్కులను, మన నాయకులకు పరిపాలన శాసనాలును, మనందరిలో సమత సోదరభావాన్ని, మన భారతదేశానికి సార్వభౌమాధికారాన్ని అందించిన – అందించడంలో అహర్నిశములు శ్రమించిన మహనీయుడు,అన్నివర్గాల హక్కుల ప్రదాత,సమ సమాజ విధాత,నవభారత నిర్మాత,పేదల జీవన ప్రభాత డాక్టర్ భీమ్ రావ్ అంబేడ్కర్ గారు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బాస్ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు సచిన్, అన్నమయ్య జిల్లా కార్యదర్శి సింగన్న, తంబాలపల్లి నియోజకవర్గం కార్యదర్శి కొగర్ మాధవ, కోగర వెంకటేష్, సొట్ట గంగాద్రి, నక్క మహేష్, లక్ష్మణ్, ఆకాష్, గంగులప్ప, పెయింటర్ బాలు, అన్నమయ్య, పురుషోత్తం, రామాంజి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Tags:133rd birth anniversary of Baba Saheb Dr. BR Ambedkar