దేశంలో కొత్తగా 1,34,154 పాజిటివ్‌ కేసులు నమోదు

న్యూఢిల్లీముచ్చట్లు:

 

దేశంలో కరోనా కేసులు వరుసగా రెండో రోజు స్వలంగా పెరిగాయి. మరో వైపు కరోనా మరణాలు మూడువేల దిగువకు చేరాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,34,154 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. కొత్తగా 2,11,499 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారని చెప్పింది. మరో 2,887 మంది వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,84,41,986కు చేరింది. మొత్తం 2,63,90,584 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటి వరకు 3,37,989 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 17,13,413 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని చెప్పింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 22,10,43,693 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:1,34,154 new positive cases were registered in the country

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *