Natyam ad

చెన్నైలో 14 కిలోల బంగారం చోరీ..

-చిత్తూరు కానిస్టేబుల్ సహకారంతో పట్టేశారు
 
చెన్నై ముచ్చట్లు:
 
చెన్నైలో 14 కిలోల బంగారం చోరీ కేసును చేధించడంలో చిత్తూరు జిల్లా కానిస్టేబుల్ కృషి చేశారు. అక్కడి పోలీసులు అడిగిన వెంటనే సహకారం అందించి.. దొంగలను పట్టుకోవడంతో సహకారం అందించారు. దీంతో అతడిని అభినందిస్తూ.. చెన్నై పోలీసులు ప్రశంసా పత్రాన్ని పంపించారు. ఆ కానిస్టేబుల్‌పై ప్రస్తుతం అభినందనల వర్షం కురుస్తోంది.చిత్తూరు జిల్లా పెనుమూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రఘురామన్‌కు చెన్నై పోలీసులు అభినందించి ప్రశంసా పత్రాన్ని అందించారు. చెన్నై నగరంలోని జరిగిన డైమండ్ చోరీ కేసులో నిందితులను పట్టుకోవడంలో రఘు కీలక పాత్ర పోషించారు. అలాగే వేలూరులోని జోయాలూకాస్ గోల్డ్ షాపులో దొంగతనం చేసిన వారిని అదుపులోకి తీసుకోవడానికి కృషిచేశారు.తమిళనాడు రాష్ట్రం వేలూరులోని జోయాలూకాస్ గోల్డ్ షాపులో 14 కిలోల బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన చెన్నై పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే నిందితులు దొరక్కపోవడంతో వాట్సప్ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న పోలీసుల సహకారం కోరారు. అదేవిధంగా ఇలాంటి కేసుల్లో చురుగ్గా పనిచేసిన పెనుమూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రఘురామన్‌ను సంప్రదించారు.దీంతో రఘురామన్ వేలూరులో జరిగిన చోరీ తీరును పరిశీలించారు. టెక్నాలజీ సాయంతో నిందితులను పట్టుకోవడంలో తన వంతు సహకారం అందించారు. అంతేకాకుండా నగల రికవరీలో కృషి చేశారు. అదేవిధంగా చెన్నైలో జరిగిన ఓ హత్య కేసులోనూ రఘురామన్‌ సహకరించారు. రఘురామన్‌ సేవలను ప్రశంసిస్తూ.. చెన్నై సహాయ ఐజీ శరవణన్‌ శనివారం జ్ఞాపిక పంపించారు. దీంతో రఘురామన్‌ను పోలీస్ ఉన్నతాధికారులు అభినందిస్తున్నారు.
పుంగనూరు ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన వర్మ – ఎంపి రెడ్డెప్ప
Tags: 14 kg gold stolen in Chennai

Leave A Reply

Your email address will not be published.