పుంగనూరు ముచ్చట్లు:
సుప్రీంకోర్టు, ప్రభుత్వం ఆదేశాల మేరకు మున్సిపాలిటి పరిధిలో బుధవారం నాడు సఫాయి కర్మచారి సర్వే కార్యక్రమం పూర్తి చేయనున్నట్లు కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటి పరిధిలో మాన్యువల్ స్కావింజర్స్ , ఇన్-శానిటరీ లెట్రిన్ల వివరాలను పూర్తి స్థాయిలో సేకరించి వాటిపై చర్యలు తీసుకునేందుకు సేకరణ కార్యక్రమం వేగంవంతం చేశామన్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 14తో గడువు ముగుస్తుందన్నారు. పట్టణ ప్రజలు త్వరిత గతిన వీటి వివరాలను కార్యాలయంలో తెలియజేయాలని కోరారు.
Tags: 14 Tosafai Karmachari survey completed in Punganur