Natyam ad

పుంగనూరులో 14, 15 శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర- మంత్రి పెద్దిరెడ్డి రాక

– రెండు రోజులు పూజలు

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

పుంగనూరు జమీందారుల కులదైవమైన శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర అత్యంత వైభవంగా మంగళవారం ప్రారంభంకానున్నది. రెండు రోజుల పాటు జరిగే జాతరలో రాత్రి అమ్మవారికి మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా పట్టువస్త్రాలు సమర్పిస్తారు. పట్టణంలో ఊరేగింపు నిర్వహించి, బుధవారం వేకువజామున అమ్మవారిని ఆలయంలో ప్రజల దర్శనార్థం ఉంచుతారు. ఆ సమయంలో తొలుత జమీందారులు తమ వేషదారణలతో పూజలు నిర్వహిస్తారు. అలాగే బెస్త, తోటి కులస్తుల పూజలు నిర్వహించి, భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండ మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి , మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా ఆధ్వర్యంలో చలివేంద్రాలు, చలువపందిళ్ళు, వైద్యశిబిరాలు, లైట్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలమనేరు డిఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు.

 

Tags; 14th and 15th Shri Suguturu Gangamma Jatara in Punganur – Arrival of Minister Peddireddy

Post Midle