పిట్టాడ లో 14వ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం
విజయనగరం ముచ్చట్లు:
విజయనగరం జిల్లా మెంటాడ మండలం పిట్టాడ గ్రామం లో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. రాజశేఖర్ విగ్రహానికి మెంటాడ మండలం ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజశేఖర్ రెడ్డి అమర్ రహే అంటూ ఆయన చేసిన సేవలు గురించి కొనియాడారు, తండ్రిని మించిన తనయుడిగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకోవడమే కాకుండా భరోసా కల్పిస్తూ వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాపారపు పైడుపునాయుడు, జడ్పిటిసి ప్రతినిధి లెoక రత్నాకర్, మండల సచివాలయం కన్వీనర్ కనిమేర కత్రినాథ, తదితర గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Tags: 14th YS Rajasekhar Reddy death anniversary program in Pittada

