-పక్కా ఇళ్లకు ఇసుక ఉచితం
-తొలి విడతలో పేదలకు 15.10లక్షల పక్కా గృహలు
-మంజూరు చేస్తూ రెండు జీవోలు జారీ చేసిన ప్రభుత్వం
-వార్డు, గ్రామసచివాలయ ఉద్యోగులకు బాధ్యతలు
-నీరు, మౌళిక వసతులకు రూ.920 కోట్లు
Date:03/12/2020
అమరావతి ముచ్చట్లు:
నిరుపేదలకు పక్కా గృహం మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధవారం జీవోలను జారీ చేసింది. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం ద్వారా 28.30 లక్షల మంది పేదలకు ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తాజాగా బుధవారం జీవో నంబర్ 8 ద్వారా 13జిల్లాల్లో తొలి విడతలో 15,10, 227 గృహలను మంజూరు చేసింది. ఇందులో 13,76,480 ఇళ్లను లబ్దిదారులే నిర్మించుకుంటారని జీవోలో పేర్కొన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80లక్షలు కేటాయించారు. ఇళ్లపట్టాల మంజూరు, నిర్మాణాల పనులను తక్షణమే చేపట్టేలా పరిపాలనా అనుమతులను జారీ చేయాలని కలెక్టర్లను సూచించారు. జీవో నంబర్ 9 ద్వారా ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల విధివిధానాలను తెలియజేసింది. ఇళ్ల నిర్మాణాల కోసం నాణ్యమైన ఇంటి సామాగ్రి కొనుగోలు కోసం జిల్లా కలెక్టర్లు పారదర్శకంగా టెండర్లు నిర్వహించి తక్కువ వ్యయంతో అందించేలా చర్యలు తీసుకోవాలి. ఒక్కో ఇంటి నిర్మాణం కోసం లబ్దిదారునికి ప్రభుత్వం ఉచితంగా 20 టన్నుల ఇసుకను అందిస్తుంది. దీని రవాణా కోసం కిలోమీటర్‌కు రూ.4.90పైసలను లబ్దిదారుడు భరించాల్సి ఉంటుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే వైఎస్సార్ జగనన్న కాలనీలో మౌళిక వసతుల కల్పన కోసం రూ.920 కోట్లు మంజూరు చేయగా అందులో పట్టణ ప్రాంతాలకు రూ.279 కోట్లు, గ్రామీణ ప్రాంతాలకు రూ.641 కోట్లు కేటాయించారు. ఈ నిధుల వినియోగానికి సంబంధించి గ్రామీణ నీటి సరఫరా విభాగం, పట్టణ ప్రజారోగ్య, మున్సిపాలీటి సాంకేతిక నిపుణులకు బాధ్యతలను అప్పగించారు. ఇళ్ల నిర్మాణాల వ్యవహారానికి సంబంధించి గతంలో కలెక్టర్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల హ్గదాలో నిర్ణయాలు తీసుకోవడం జరిగేది. ప్రస్తుతం ఈ హ్గదాను గ్రామ, వార్డు సచివాలయ (అభివృద్ది) జాయింట్ క లెక్టర్లకు కట్టెబెట్టారు. ఇళ్ల నిర్మాణాల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం కమిటిలను ఏర్పాటు చేసింది. రాష్ట్రస్థాయి కమిటికి ప్రధానకార్యదర్శి చైర్మన్‌గా గృహనిర్మాణశాఖ మేనేజింగ్ డైరె క్టర్ మెంబర్ కన్వీనర్‌గా, హౌసింగ్, ఆర్థిక, రెవెన్యూ, పీఆర్అండ్ ఆర్డీ, ఎంఏ అండ్ యూడీ, విద్యుత్, పరిశ్రమశాఖలకు చెందిన ప్రిన్సిపల్ కార్యదర్శులు, ఏపీఎండిసీ ఏండీ, గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శి లేదా డైరెక్టర్ సభ్యులుగా ఉంటారు. జిల్లాస్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా కమిటి పనిచేస్తుంది. కాగా ఇళ్ల నిర్మాణాల బాధ్యతలను గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఏడుగురు ఉద్యోగులను భాగస్వామ్యులను చేశారు.
జిల్లాలవారీగా మంజూరైన ఇళ్లు
శ్రీకాకుళం-92,716
విజయనగరం-98,286
విశాఖపట్నం-52,050
ఈస్ట్‌గోదావరి-1,48,526
వెస్ట్ గోదావరి-1,70,699
కృష్ణా-1,67,541
గుంటూరు-1,63,053
ప్రకాశం-84,027
నెల్లూరు-53,953
చిత్తూరు-1,74,240
కడప-95,649
అనంతపురం-1,11,099
కర్నూలు-98,388
ఢిల్లీ రైతులకు మద్దతుగా సంఘీభావ ర్యాలీ
Tags: 15.10 lakh houses sanctioned for 13 districts