తమిళనాడులో కుంభవృష్టి భవనం కూలి 15 మంది మృతి

15 killed in Tamil Nadu building collapse

15 killed in Tamil Nadu building collapse

Date:02/12/2019

కోయంబత్తూరు ముచ్చట్లు:

తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని చెన్నై, కడలూరు తూత్తుకూడీ, తిరువల్లూరు కాంచీపురం సహా 8 జిల్లాల్లో అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు కురుస్తుండడంతో పాఠశాలలు, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్ష బీభత్సానికి కోయంబత్తూరు జిల్లా మెట్టుపాళ్యంలో నాలుగు భవనాలు కూలాయి. ఈ ఘటనల్లో ఇళ్లలో నిద్రిస్తున్న 15 మంది మృతి చెందారు. భవనాల శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు సమాచారం. ఘటన స్థలాల వద్ద అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.ముందస్తు వాతావరణ హెచ్చరికలతో ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంది. చెన్నూ నగరంలో 176 పునరావస శిబిరాలకు ఏర్పాటు చేసారు. నీటిలో చిక్కుకున్న వారిని రక్షించడానికి పడవలు కుడా సిద్దం చేసారు.   పొరుగున వున్న పుదుచ్చేరిని కుడా భారీ వర్షాలు అతలాకుతలం చేసాయి. వర్షాల దృష్ట్యా పుదుచ్చేరితో పాటు ఐదు జిల్లాల్లోని విద్యాసంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఈరోజు సెలవు ప్రకటించారు. ఈ నెల 15నుంచి మరోసారి వర్ష సూచన ఉందని చెన్నైలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.  తమిళనాడులోని కోయంబత్తూరు మెట్టుపాళ్యంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి నాలుగు భవనాలు కూలి కనీసం 15 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో వారంతా నిద్రలో ఉండడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు సమాచారం. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే ఎంత మంది మృతి చెందారన్నదానిపై అధికారిక సమాచారం లేదు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తమిళనాడులో పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు మరో రెండు రోజులు పాటు కొనసాగే అవకాశం ఉందని చెన్నైలోని వాతావరణ పరిశోధన కేంద్రం ప్రకటించింది. భారీ వర్షాల దృష్ట్యా పుదుచ్చేరితో పాటు ఐదు జిల్లాల్లోని విద్యాసంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఈరోజు సెలవు ప్రకటించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. చెన్నై, కాంచీపురం, కడలూరు, మదురై, కోయంబత్తూరు తదితర ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది. దీంతో ఆయా జిల్లాల్లో నివాసాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నెల 15నుంచి మరోసారి వర్ష సూచన ఉందని చెన్నైలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

 

తప్పుడు ప్రకటనలు, సందేశాలు, నంబర్ల వ్యవహారానికి తెర

 

Tags:15 killed in Tamil Nadu building collapse

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *