Natyam ad

15 వేల కోట్ల టీటీడీ డిపాజిట్లు

తిరుమల  ముచ్చట్లు:

తిరుమల తిరుపతి క్షేత్రంలో కొలువైన మలయప్ప స్వామి ఆస్తుల వివరాలను టీటీడీ వెల్లడించింది. కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీనివాసుడు వైకుంఠాన్ని వదిలి సాలగ్రామ శిలరూపంలో తిరుమలలోని ఆనంద నిలయంలో కొలువైయున్నారు. శ్రీ‌ వేంకటేశ్వరుడి క్షణకాలం పాటు జరిగే దర్శన భాగ్యం‌ కోసం దేశ విదేశాల నుంచి ప్రతి నిత్యం భక్తులు వివిధ రూపాల్లో స్వామి వారి సన్నిధికి చేరుకుంటూ ఉంటారు. ఇలా తిరుమలకు చేరుకున్న భక్తులు స్వామి వారికి ముడుపుల‌ రూపంలో వివిధ రూపాల్లో కానుకలు సమర్పిస్తుంటారు. భక్తులు స్వామి వారిపై భక్తి భావంతో శ్రీవారి హుండీలో సమర్పించే నగదు కార్పస్ ఫండ్ రూపంలో టీటీడీ వివిధ జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేసి భద్రపరుస్తుంది. నగదుతోపాటుగా భక్తులు సమర్పించి బంగారాన్ని సైతం‌ జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉంచుతుంది.
బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు వివిధ ట్రస్టులకు విరాళాలు అందిస్తూ ఉంటారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా పది వేల రూపాయలు అందించిన భక్తులకు ప్రివిలేజ్ ద్వారా స్వామి వారి దర్శన భాగ్యం‌‌ కల్పిస్తుంది. అయితే శ్రీవాణి ట్రస్టుకు వచ్చిన నగదును పురాతన ఆలయాలు ఆధునీకరణ, నూతన దేవాలయాలు నిర్మాణం చేపట్టి, ధూపదీపన నైవేద్యాలు సమర్పించేందుకు టిటిడి వినియోగిస్తుంది.

 

Post Midle

శ్రీ వేంకటేశ్వరుడిపై అపారమైన భక్తితో వేల కిలో మీటర్లు సైతం లెక్క చేయకుండా తిరుమలకు చేరుకుని రోజులు, గంటల తరబడి వేచి ఉండి ఆనంద నిలయంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మూలవిరాట్ దర్శనం పొంది పునీతులు అవుతుంటారు.. అంతే కాకుండా శ్రీనివాసుడికి తమ తమ స్తోమతకు తగ్గట్టుగా భక్తులు హుండీ ద్వారా కానుకలు సమర్పిస్తుంటారు.. ఇలా ఏడాది కాలంలో టిటిడికి భక్తులు హుండీ ద్వారా రూ. 700 నుంచి రూ.1000 కోట్ల మేర ఆదాయం లభిస్తుంది.. ఇలా వచ్చిన నగదును కార్పస్ ఫండ్‌గా జాతీయ బ్యాంకుల్లో జమ చేస్తుంది టీటీడీ. నగదుతో పాటుగా బంగారును డిపాజిట్ చేసి భద్ర పరుస్తుంది.ప్రతి మూడు నెలలకు ఓసారి జరిగే పాలక మండలి సమావేశంలో డిపాజిట్లపై టిటిడి ఎప్పటికప్పుడు చర్చిస్తూనే ఉంటుంది. కొందరు సోషల్ మీడియా వేదికగా ఏపీ ప్రభుత్వాన్ని టిటిడి ఆదుకుంటోందని ప్రచారం సైతం చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టిటిడి ఎప్పటికప్పుడు వివరణ ఇస్తోంది. కానీ ఇటీవల ఈ ప్రచారం మరింత ఎక్కువగా మారింది. టిటిడి ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి, టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి భక్తులు సమర్పించి నగదును ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సెక్యూరిటీ డిపాజిట్లు రూపం ఇచ్చే ప్రక్రియ టిటిడికి కొత్తదేం కాదు. 1987వ సంవత్సరంలో సెక్షన్ 111(3) ఎండోమెంట్ యాక్ట్ 30, 1990 గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం టీటీడీ రూల్ నంబర్ 80లో సెక్యూరిటీ డిపాజిట్లు ప్రభుత్వ నియమాలు అనుసారం ప్రభుత్వ అనుమతితో డిపాజిట్ చేయవచ్చని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఈ నిబంధనలను అనుసరించి టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షత జరిగిన పాలక మండలి సభ్యులతో డిపాజిట్లపై చర్చించి సాధ్యా సాధ్యాలపై ఓ కమిటీ వేసి పరిశీలన చేయాలని ఆదేశాలు జారీ చేశారు.ఆనాటి నుంచి నేటి వరకు డిపాజిట్ల వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా నగదు డిపాజిట్లు రాష్ట్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టిందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే టిటిడి డిపాజిట్ల వ్యవహారంలో జరుగుతున్న ప్రచారంపై శనివారం‌ తిరుమల అన్నమయ్య భవన్ లో జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఓ భక్తుడు నేరుగా టిటిడి ఈవో ధర్మారెడ్డిని ప్రశ్నించారు..

 

 

 

భక్తుడి ప్రశ్నకు సమాధానం ఇచ్చిన‌ ఈవో టిటిడి డిపాజిట్ల వ్యవహారాన్ని తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా టిటిడి డిపాజిట్లపై జరుగుతున్న ప్రచారాన్ని ఈవో ఏవి.ధర్మారెడ్డి ఖండించారు. టిటిడిని టార్గెట్‌గా చేసుకుని దుష్ప్రచారం చేయడం తగ్గదని హెచ్చరించారు. ఐదు వేల కోట్ల డిపాజిట్లను స్టేట్ గవర్నమెంట్‌కు బాండ్ల రూపంలో ఇచ్చారనేది ముమ్మాటికీ అవాస్తవమన్నారు. నేషనలైజ్డ్ బ్యాంకులలోనే నగదు డిపాజిట్ చేయడం జరిగిందన్నారు. ఇలాంటి వందంతులు ఎవరు నమ్మొద్దని భక్తులను టిటిడి ఈవో విజ్ఞప్తి చేశారు. మెచ్యూరిటీ పూర్తైన రూ. 5 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం బాండ్స్ రూపంలో డిపాజిట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు. అంతేకాదు టీటీడీ ఫిక్సిడ్ డిపాజిట్లు విషయంలో ఎలాంటి వదంతలు నమ్మవద్దన్నారు. రూ.15,900 కోట్ల మేరకు టీటీడీ ఫిక్సిడ్ డిపాజిట్లు  వివిధ జాతీయ బ్యాంకుల్లో ఉన్నాయని పేర్కొన్నారు. అత్యధిక వడ్డీనిచ్చే జాతీయ బ్యాంకుల్లో మాత్రం టీటీడీ ఫిక్సిడ్ డిపాజిట్లు చేస్తుందని ఈవో స్పష్టం చేశారు. హిందూ మత ద్వేషులు టీటీడీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు ధర్మారెడ్డి.మూడేళ్లలో శ్రీవారి నగదు డిపాజిట్లు భారీగా పెరిగాయని.. 2019 జూన్‌ లో నగదు డిపాజిట్ రూ.  13,025 కోట్లు ఉండగా ప్రస్తుతం రూ. 15,938 కోట్లకి డిపాజిట్లు చేరుకున్నాయని తెలిపారు. అంతేకాదు మరోవైపు బంగారం 2019లో 7,339.74 కేజీలు ఉండగా ప్రస్తుతం 10.258.37 కేజీల బంగారం నిల్వలున్నాయని తెలిపారు.

 

 

 

ఈవో ధర్మారెడ్డి.వెంకన్న దర్శనానికి వచ్చిన భక్తులు కానుకలను ‘హుండీ’లో వేస్తూ ఉంటారు. శ్రీమంతుల నుంచి సామాన్యుడి వరకూ ఆ కోనేటి రాయుడికి తమ శక్తి కొలది.. నగదు, బంగారం, వెండి వస్తువుల రూపాల్లో రకరకాల కానుకలు సమర్పిస్తుంటారు. పూర్వకాలంలో ఆలయ కైంకర్యాలు, నిర్వహణ కోసం హుండీ ఏర్పాటు చేశారు.అక్టోబర్ నెలలో 22.72 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ. 122.23 కోట్లు ఆదాయం లభించిందని తెలిపారు. రూ. 1.08 కోట్ల మంది శ్రీవారి లడ్డూలు విక్రయం జరిగినట్లు చెప్పారు. స్వామివారికి మొత్తం 10.25 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు ధర్మారెడ్డి తెలిపారు. ఇక డిసెంబర్ నుండి ప్రయోగత్మకంగా విఐపీ బ్రేక్ దర్శనం ఉదయం 8 గంటల నుండి మొదలు పెట్టనున్నామని చెప్పారు. ఈ బ్రేక్ సమయంలో  మార్పు వల్ల అన్ లైన్ లో డిసెంబర్ నెల రూ.300 దర్శనం కోటా జాప్యం జరగనుందని పేర్కొన్నారు. త్వరలో ఆన్ లైన్ లో దర్శన టిక్కెట్లు విడుదల చేస్తామన్నారు టీటీడీ ఈఓ ధర్మారెడ్డినవంబర్ 30వ తేదీ బోర్డు మీటింగ్ లో ఆనంద నిలయం ఆనంత స్వర్ణమయంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. నూతన పరకామణి భవనంలో .. త్వరలో శ్రీవారి హుండీ కానుకలు లెక్కింపు ప్రారంభిస్తామని మరోమారు తెలిపారు ఈవో.

 

Tags: 15 thousand crore TTD deposits

Post Midle