పుంగనూరు, చౌడేపల్లె మండలాలకు 150 ఆక్సిమీటర్లు విరాళం

పుంగనూరు ముచ్చట్లు:

 

విశ్రాంత ఎంపీడీవో వెంకట్రమణారెడ్డి తన సొంత నిధులతో 150 ఆక్సి మీటర్లను పుంగనూరు, చౌడేపల్లె మండలాల సిబ్బందికి విరాళంగా అందజేశారు. సోమవారం మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వెంకట్రమణారెడ్డి లక్షరూపాయలు విలువ చేసే ఆక్సిమీటర్లను ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించారు. సచివాలయ ఉద్యోగులు, వైద్య సిబ్బంది ఆక్సిమీటర్ల ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని గుర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, మాజీ ఎంపీపీ నరసింహులు, ఆర్టీసి మజ్ధూర్‌ అధ్యక్షుడు జయరామిరెడ్డి, ఇన్‌చార్జ్ ఎంపీడీవో రాజేశ్వరి, తహశీల్ధార్‌ వెంకట్రాయులు, మెడికల్‌ ఆఫీసర్‌ రెడ్డికార్తీక్‌ పాల్గొన్నారు.

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags; 150 oximeters donated to Punganur and Choudepalle zones

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *