Natyam ad

బ్యాంకులకు 15 వేల కోట్లు

ముంబై ముచ్చట్లు:
 
బ్యాంకుల క్యాపిటల్ -రిజర్వ్ అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం వచ్చే నెల వీటికి రూ.15వేల కోట్లను చెల్లించే అవకాశం ఉందని ఫైనాన్స్ మినిస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో నెట్టుకొస్తున్న  పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్,  సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు ఎక్కువ నిధులు కేటాయిస్తారని తెలుస్తోంది. 2017 ఫైనాన్షియల్ ఇయర్ నుండి ఐదేళ్లలో ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు (పీఎస్బీ) రూ.3.10 లక్షల కోట్లకుపైగా రీక్యాపిటలైజేషన్ ఫండ్స్ చెల్లించింది. ఈ సంవత్సరం  సవరించిన బడ్జెట్ అంచనాలలో వీటికి రూ. 15 వేల కోట్లు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తమ మూలధన అవసరాల గురించి తెలియజేయాల్సిందిగా ఆర్థిక సేవల విభాగం ప్రభుత్వ రంగ బ్యాంకులను కోరిందని సీనియర్ ఆఫీసర్ ఒకరు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మొదట్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్ రీక్యాపిటలైజేషన్ కోసం రూ.20వేల కోట్ల బడ్జెట్ ఇచ్చింది. అయితే పీఎస్బీల ఆర్థిక పరిస్థితులు  మెరుగుపడడంతో ఈ మొత్తాన్ని రూ.15వేల కోట్లకు తగ్గించింది. మొండిబాకీలకు ప్రొవిజన్లు పెరగడంతో బలహీనమైన బ్యాంకుల సంఖ్య బాగా తగ్గింది. ఆర్బీఐ  ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (పీసీఏ) ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌లో ఉన్న బ్యాంకుల సంఖ్య కూడా పడిపోయింది. ఇప్పుడు కేవలం ఒకే బ్యాంకు పీసీఏ ఫ్రేమ్వర్క్లో ఉంది. ప్రైవేటీకరణకు రెడీగా ఉన్న  ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుతోపాటు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకూ నిధులు అందుతాయని తెలుస్తోంది.  ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాలను సంపాదించాయి. 2023  ఫైనాన్షియల్ ఇయర్లో ప్రభుత్వం బ్యాంక్ రీక్యాపిటలైజేషన్ కోసం బడ్జెట్‌‌‌‌ను కేటాయించనప్పటికీ, బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు బలహీనంగా ఉంటే సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  మునుపటి ఆర్థిక సంవత్సరంలో, ప్రభుత్వం ఐదు పీఎస్బీలకు రూ.20వేల కోట్లను ఇచ్చింది.  పీసీఏ కింద ఉన్న మూడు బ్యాంకులకు రూ.11,500 కోట్లు ఇచ్చారు. వీటిలో యుకో బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్,  సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
 
Tags; 15,000 crore to banks