16 ఏళ్ల బాలికను  30 సార్లు పొడిచి…

Date:04/12/2019

భోపాల్ ముచ్చట్లు:

మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన జరిగింది. తన ప్రేమను తిరస్కరించిందన్న అక్కసుతో ఓ యువకుడు 16ఏళ్ల బాలికను కత్తితో కిరాతకంగా చంపేశాడు. ఏకంగా 30సార్లు ఆమెను పొడిచి తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. దీంతో బాలిక తీవ్ర రక్తస్రావానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌ జిల్లా కుడ్వారీ గ్రామానికి చెందిన శివకుమార్‌ (24) అనే యువకుడు ప్రేమ పేరుతో అదే గ్రామానికి చెందిన బాలికను వేధిస్తున్నాడు. దీంతో ఆమె మూడు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. తనను కటకటాలపాటు చేసిన ఆమెపై శివకుమార్ పగ పెంచుకున్నాడు. మంగళవారం బెయిల్‌పై బయటకు వచ్చిన అతడు నేరుగా బాలిక ఇంటికి వెళ్లాడు.అదే సమయంలో తల్లిదండ్రులు పనిమీద బయటకు వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. దీంతో లోనికి వెళ్లిన శివకుమార్ తలుపులు మూసేసి కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనను చూసిన బాలిక సోదరుడు స్థానికులను అప్రమత్తం చేయడంతో వారంతా వచ్చి తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లారు. అప్పటికే ఈ దుర్మార్గుడు బాలికను కడుపులో పొడుస్తూ కనిపించాడు. నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పడంతో అంతా కన్నీటి పర్యంతమయ్యారు. పోస్టుమార్టం రిపోర్టుల బాలిక శరీరంపై 30 కత్తిపోట్లు ఉన్నట్లు తేలడంతో పోలీసులు సైతం షాకయ్యారు.

 

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష

 

Tags:16-year-old girl stabbed 30 times

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *