పుంగనూరు ఎంఎస్ఆర్ థియేటర్ వద్ద 160 కెవి ట్రాన్స్‌ఫార్మర్ కు అగ్ని ప్రమాదం
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలో పుంగనూరు మండలం, పుంగనూరు పట్టణంలో ఎంఎస్ఆర్ థియేటర్ వద్ద గల MKR మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ప్రక్కన బుధవారము సుమారు 11.25 సమయములో APSPDCL కు సంబంధించిన 160 కెవి ట్రాన్స్‌ఫార్మర్ అగ్ని ప్రమాదముణకు గురి అయినది. వెంటనే లైన్ మ్యాన్ మహేష్ కేంద్రమునకు రావడంతో సిబ్బంది, LF ఇ. సుబ్రమణ్యం, డ్రైవర్ ఆపరేటర్ M. లోకేష్ రెడ్డి, ఫైర్ మాన్ V. కేశవ, హోంగార్డ్ K. మోహన్ బాబు లతో సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ మండుచున్న ట్రాన్స్‌ఫార్మర్ ను పూర్తిగా ఆర్పివేయడం జరిగింది. ఇందులో భాగంగా పుంగనూరు పట్టణ AE శశిధర్గా,లైన్ మ్యాన్ మహేష్ , మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు. ఆస్తి నష్టం అంచనా సుమారుగా 1.25 లక్షలుగా తెలియజేయడమైనది.

Tags: 160 KV transformer caught fire at Punganur MSR theatre
