రామగిరి హరితహారంలో 1.60 లక్షల మొక్కలు

– స్పెషల్ ఆఫీసర్ సాయినాథ్

పెద్దపల్లి  ముచ్చట్లు:

 

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లో గల 17 గ్రామ పంచాయతీలకు గాను 1.60 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం అని  మైనింగ్, ప్రత్యేకాధికారి  సాయినాథ్ అన్నారు. బుధవారం రత్నాపూర్ లో సర్పంచ్ పల్లె ప్రతిమ పివీరావు ఆధ్వర్యంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. అనంతరం అయన మాట్లాడుతూ మండలంలో గల గ్రామ పంచాయతీ లలో 17 నర్సరీ లు ఉండగా వాటిలో 2.60 లక్షల మొక్కలు పెంచామని తెలిపారు. వీటిలో 1.60 లక్షల మొక్కలు గ్రామాలల్లో, 20 వేల మొక్కలు రహదారులకు ఇరువైపులా నాటడానికి ప్రణాళిక సిద్ధం చేసామని అయన అన్నారు, అనంతరం పల్లె ప్రకృతి వనం 2 చదును చేస్తున్న పనులు పరిశీలించారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ తూముట్ల విజయ్ కుమార్, ఎంపీవో కాటం భాస్కర్, కార్యదర్శి ఉప్పులేటి ప్రదీప్, వార్డు సభ్యులు కొవ్వూరు సురేష్, బొంగరాల రవి, కో అప్షన్ సభ్యుడు ఉనుగొండ మధుకర్ రావు, ఆరోగ్య కార్యకర్తలు గడ్డం సునీత, మేడ స్వరూప, పంజా శాంతి,కారోబార్ కొండపర్తి శ్రీనివాస్, తెరాస నాయకులు జంగేటి కుమార్, సందేవేన కుమార్, ముక్కెర సారధి గౌడ్, సాగర్ల తిరుపతి, బోగే సతీష్, ధర్ముల వెంకటేష్, మోత్కూరి వెంకన్న, మూడుస్ చంద్రయ్య పాల్గొన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags;1.60 lakh plants in Ramagiri Greenery

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *