జగనన్న తోడు ద్వారా 16,369 మందికి లబ్ధి
– చిరు వ్యాపారులకు రూ. 10 వేలు చొప్పున వడ్డీలేని రుణాలు
– కాకినాడ జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా
– పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచన

కాకినాడ ముచ్చట్లు:
జగనన్న తోడు పథకం ద్వారా అయిదో విడతలో కాకినాడ జిల్లాలో మొత్తం 16,369 మంది లబ్ధిదారులకు రూ. 16.36 కోట్ల మేర లబ్ధి చేకూరినట్లు జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా తెలిపారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న తోడు పథకం కింద అయిదో విడతలో చిరు వ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి బ్యాంకుల ద్వారా రూ.10 వేలు చొప్పున వడ్డీలేని రుణాలను బటన్ నొక్కి అందించే కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్ వివేకానంద సమావేశ మందిరం నుంచి కలెక్టర్ కృతికా శుక్లా, జెడ్‌పీ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ సుంకర శివ ప్రసన్న, కుడా ఛైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, డీఆర్‌డీఏ, మెప్మా అధికారులు, లబ్ధిదారులు హాజరయ్యారు. కార్యక్రమంలో జగనన్న తోడు కింద ఇప్పటికే లబ్ధిపొంది విజయవంతంగా చిరువ్యాపారాలు నిర్వహిస్తున్న వివిధ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. ముఖ్యమంత్రి బటన్‌నొక్కి వడ్డీలేని రుణాలను, వడ్డీ రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టర్.. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి లబ్ధిదారులకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల లబ్ధిదారులకు మెగా చెక్‌లు అందజేశారు.
Tags: 16,369 people benefited through Jagananna Todu
