భారత్ లో కొత్తగా 16935 కరోనా కేసులు 51 మరణాలు నమోదు..

ఢీల్లీ  ముచ్చట్లు:

ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే ఎక్కువ గానే ఇవ్వాళ కరోనా కేసులు నమోదు అయ్యాయి.కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 16935 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,37,67,534 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,44,264 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.98 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 51 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,25,760 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 16069 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,30,81,441 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2,00,04,61,095 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 4,46,671 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

 

Tags: 16935 new corona cases 51 deaths recorded in India..

Leave A Reply

Your email address will not be published.