17 లక్షల కొత్త ఓటర్లు

17 lakh new voters

17 lakh new voters

Date:20/09/2018
హైదరాబాద్ ముచ్చట్లు :
డిలిషన్, అడ్రెస్ చేంజింగ్ కు 25 వ తేదీ వరకు సమయం ఇచ్చారు. ఓటర్ నమోదు చాలా ఉత్సాహంగా చేస్తున్నారు. 17 లక్షల ఓట్లు కొత్తగా నమోదు చేసుకున్నారు. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, యువత కూడా పెద్దఎత్తున ఓటర్ నమోదు చేసుకుంటున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. బోగస్ ఓట్ల ఏరివేత జరుగుతుంది.  ఈవీఎంలు 23 జిల్లాలకు చేరుకున్నాయి. 22 తేదీ వరకు అన్ని జిల్లాలకు చేరుకుంటాయి. బిఎల్ ఓ లు అందరిని అపాయింట్ చేస్తున్నాం వారికి శిక్షణ కూడా ఇస్తున్నాం.
ఎన్నికల అవగాహన కోసం మాస్టర్ ట్రైనింగ్ కోసం ఢిల్లీ కి పంపిస్తున్నామని అయన అన్నారు. ఇఆర్వో నెట్ వచ్చాక బోగస్ ఓట్లు తగ్గాయి, ఫొటోలు,పేర్లు ఒకే విదంగా ఉన్న లాక్షా యబై వేల ఓట్లు గుర్తించాం. ఓటర్ నమోదు కోసం చాలా ప్రచారం చేశాం మంచి ఫలితం వస్తుంది. నేమ్ ఆడిషన్ కోసం కొంత సమయం కావాలి. 32574 మంది బిఎల్ ఓ లు ఉన్నారు. సీఈఓ సైట్ లో ఉన్న లిస్ట్ ఫైనల్ లిస్ట్. ప్రతిపక్ష పార్టీలకు నేను చెప్తున్న ఓట్ల తొలగింపు, చంజ్ ఆఫ్ అడ్రెస్ కి సమయం ఇచ్చాము. దానికి గురించి అవగాహన కల్పించండని అయన అన్నారు.
ఓటర్ నమోదు మాత్రం ఎన్నికల గడువు వరకు చేసుకోవచ్చు. ఫామ్ 6 లో నమోదు కోసం ఎన్నికల నామినేషన్ కు 10 ముందు వరకు చేసుకోవచ్చు. కొన్ని పార్టీల వారు వచ్చారు మేము కొన్ని జిల్లాలో పోటీ చేస్తాం మాకు సింగిల్ సింబల్ ఇవ్వాలని కోరారు .ఇంకా సమయం ఉంది. మన రాష్ట్రంలో 52100 ఈవీఎంలు, 39470 వేలు వివిఫ్యాట్ లు అవసరం. ఈవీఎంలలో ఓట్లు వేస్తే ఒకే పార్టీ కి పడుతున్నాయి అనేది కరెక్ట్ కాదు అయిన కేంద్ర ఎన్నికల కమిషన్ వారు దానిపై విస్తృతంగా ప్రచారం కల్పించాలి అని చెప్పారు రాజకీయ పార్టీ ల వారితో ఫస్ట్ లెవెల్ చెకింగ్ చేయిస్తామని అన్నారు.
ఇది అంత రికార్డింగ్ జరుగుతుంది.  పొలిటికల్ పార్టీల ముందే ఇవ్వన్నీ జరుగుతాయి.మాక్ పోలింగ్ కూడా చేస్తామని అన్నారు. దీనికి కేంద్ర ఎన్నికల కమిషన్ వారు కొన్ని నియమ నిబంధనలు పెట్టారు.  ఎన్ని ఓట్లు తీసుకోవాలి అని కొన్ని నియోజకవర్గంలోకి వాటిని పంపిస్తున్నాం. ప్రజలు,పార్టీల నాయకుల ముందే మాక్ పోలింగ్ చేస్తామని అన్నారు. ఈవీఎంల పనితీరు పై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని అన్నారు.
Tags:17 lakh new voters

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *