విషాహారం తిని 17 మందికి స్వస్థత

మండపేట ముచ్చట్లు:


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో జరిగిన ఓ వివాహ వేడుకలో అపశృతి చోటుచేసుకుంది. ఫుడ్ పాయిజన్ జరిగి 17 మంది పెళ్లి బృందం అస్వస్థతకు గురయ్యారు.  మండపేటలోని పెద్ద కాలువ సమీపంలో నివాసముంటున్న సిద్దాంతపు నాగేశ్వరరావు కుమార్తె వివాహ వేడుకల్లో ఈ సంఘటన జరిగింది. శనివారం తెల్ల వారుజామున 3:30 సమయంలో బాధితులను 108 అంబులెన్స్ లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యురాలు వాహిని ప్రియాంక సకాలంలో స్పందించి వైద్యం అందిచడంతో బాధితులు కోలు కుంటున్నారు. వీరంతా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నలు మూలల నుండి వచ్చిన పెళ్లి వారుగా తెలుస్తోంది.

 

Tags: 17 people got cured after eating poison

Leave A Reply

Your email address will not be published.