18న హజ్‌క్యాంపు ఏర్పాటు

18 Hajj

18 Hajj

Date:12/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

హాజ్‌యాత్రకు వెళ్లే ముస్లింలకు అవగాహన కల్పించేందుకు ఈనెల 18న సోమవారం పుంగనూరులో హాజ్‌క్యాంపు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అంజుమన్‌ కమిటి అధ్యక్షుడు షా, సెక్రటరీ అమ్ము తెలిపారు. బుధవారం పట్టణలో ముస్లింలు అంజుమన్‌ కమిటి ఆధ్వర్యంలో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ ప్రతియేటా నిర్వహించే విధంగా హాజ్‌యాత్రికుల కోసం అవగాహన సదస్సు పట్టణంలోని ఎన్‌ఎస్‌.పేటలో నిర్వహించేందుకు చర్చించడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు జాఫర్‌,ఖాన్‌, ఇస్మాయిల్‌, ఎంఎస్‌.సలీంబాషా, ఎస్‌.అఫ్సర్‌బాషా, తాజు, జపుల్లాఖాన్‌, పిఎన్‌బిఎస్‌ నజీర్‌సాబ్‌ తదితరులు పాల్గొన్నారు.

నాటుసారా తాగి యువకుడు మృతి

Tags: 18 Hajj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *