18 శాతం తగ్గిన‌ ఇంధన వినియోగం

Date:09/04/2020

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ది. దీంతో దేశ ప్ర‌జలంద‌రూ ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. అత్య‌వ‌స‌ర విభాగాల్లో ప‌నిచేసే వారు త‌ప్ప మిగ‌తా రంగాల్లో వాహ‌నాల వాడ‌కం  పూర్తిగా త‌గ్గిపోయింది. ఈ నేప‌థ్యంలో దేశంలో ఇంధన వినియోగం కూడా భారీగా ప‌డిపోయింది. గత నెల  ఇంధన వినియోగం 18 శాతం తగ్గిన‌ట్లు గురువారం విడుదలైన అధికారిక గ‌ణాంకాలు తెలియ‌జేస్తున్నాయి. కాగా, దేశంలో ఇంధన వినియోగం ఈ స్థాయిలో క్షీణించడం దశాబ్దం తర్వాత ఇదే తొలిసారి. డీజిల్, పెట్రోల్, ఏవియేషన్ టర్బైన్ ఇంధనం ఇలా అన్ని ర‌కాల ఇంధ‌నాల వాడ‌కం త‌గ్గ‌డంతో మార్చిలో పెట్రో ఉత్పత్తుల వినియోగం 17.79 శాతం తగ్గి 16.08 మిలియన్ టన్నులకు పడిపోయినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. పెట్రోలు అమ్మకాలు 16.37 శాతం తగ్గి 2.15 మిలియన్ టన్నులకు పడిపోయినట్టు గణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి. ఇక‌, లాక్‌డౌన్ ఏప్రిల్ 30 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌న్న వార్త‌లు వెలువ‌డుతున్న‌ నేపథ్యంలో ఏప్రిల్‌లో ఇంధన వినియోగం మ‌రింత త‌గ్గుతుంద‌నే అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి.

సాయానికి భారత్‌ ఎప్పుడూ ముందుంటుంది-

Tags: 18% reduced fuel consumption

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *