Natyam ad

18 నుండి 31 వరకు రాత్రి 11 గం. నుండి ఉ 5 గం. ల వరకు కర్ఫ్యూ అమలు

– జన సమూహంలో మాస్క్ వాడకం తప్పనిసరి . . లేనిచో రూ.100 రూ. జరిమానా
– వివాహాలు, మత సంబంధమైన కార్యక్రమాలకు బహిరంగ ప్రదేశాల్లో 200 మందికి, కళ్యాణ మండపాల్లో 100 -మందికి మాత్రమే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అనుమతి
– సినిమా థియేటర్ లలో భౌతిక దూరం పాటిస్తూ సీట్ మార్చి సీటుకు అనుమతి
– ప్రజా రవాణా వాహనాలలో సిబ్బంది మరియు ప్రయాణికులకు మాస్క్ వాడకం తప్పనిసరి
– జిల్లా కలెక్టర్
చిత్తూరు ముచ్చట్లు:
 
 
రాష్ట్రంలో కోవిడ్ – 19 ప్రబలుతున్న దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 18 నుండి 31 వ తేదీ వరకు రా.11 గం.ల నుండి ఉ.5 గం.ల వరకు జిల్లాలో కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ యం. హరినారాయణన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కర్ఫ్యూలో మెడికల్, మీడియా, కమ్యూనికేషన్, పెట్రోల్ బంక్ లు, విద్యుత్, నీటి సరఫరా, పారిశుధ్యం తదితర నిత్యావసరములను మినహాయించడమైనదన్నారు. జన సమూహం లో వెళ్ళే ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్ లు వాడాలని, మాస్క్ పూర్తిగా ముక్కు, నోరు కవర్ అయ్యేటట్లు చూడాలన్నారు. మాస్క్ వాడకుండా జన సమూహంలోకి వెళ్ళే వారికి రూ.100 జరిమానా విధిస్తామన్నారు. వివాహాలు, మత సంబంధమైన కార్యక్రమాలకు హాజరయ్యే వారికి బహిరంగ ప్రదేశాల్లో అయితే 200 మందికి, కళ్యాణ మండపాల్లో అయితే 100 మందికి మాత్రమే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అనుమతించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాలకు హాజరయ్యే ప్రజలు కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ పాటిస్తూ మాస్క్, స్యానిటైజేషన్, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు. సినిమా థియేటర్లలో సీట్ కు సీట్ కు మధ్య భౌతిక దూరాన్ని పాటించాలని, మాస్క్, స్యానిటైజేషన్ ఉన్న వారిని మాత్రమే థియేటర్ లలో అనుమతించాలన్నారు. ప్రజా రవాణా వాహనాల్లో సిబ్బంది మరియు ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ వాడాలన్నారు. వాణిజ్య సమూహాలు, షాపులు, సంస్థల ఆవరణాలలో మాస్క్ లు వాడని వారిని అనుమతిస్తే ఆ యాజమాన్యాలకు రూ.10 వేల నుండి రూ.25 వేల వరకు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. కోవిడ్ నిబంధనలను పాటించకుండా అతిక్రమించిన మార్కెట్, వాణిజ్య సముదాయాలను మూయించడం జరుగుతుందన్నారు. మార్కెట్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రజలలో కోవిడ్ నిబంధనల పై అవగాహన పెంచాలన్నారు. మతపరమైన దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, మసీదులలో తప్పనిసరిగా భక్తులు భౌతిక దూరం పాటించేలా చూడాలని, కోవిడ్ ప్రబలకుండా, కోవిడ్ నిబంధనలను అమలు చేయాలన్నారు. ఈ నిబంధనలను అతిక్రమించిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
 
 
కర్ఫ్యూ నుండి మినహాయింపులు . .
1. ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ ల్యాబ్ లు, మెడికల్ షాపులు
2. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా
3. టెలీ కమ్యూనికేషన్, ఇంటర్ నెట్ సర్వీస్, బ్రాడ్ కాస్టింగ్ సర్వీసెస్, ఐటి సర్వీసెస్
4. పెట్రోల్ బంక్ లు
5. విద్యుత్ సర్వీసులు
6. నీటి సరఫరా మరియు పారిశ్యుద్యం
7. అత్యవసర సర్వీసులు అందించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు మరియు, న్యాయ శాఖలు, స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థల సిబ్బందికి ఐడెంటి కార్డు తప్పనిసరి.
8. ప్రభుత్వ/ ప్రైవేట్ ఆసుపత్రులలో పని చేసే డాక్టర్ లు, వైద్య అధికారులు, నర్సింగ్ స్టాఫ్, పారా మెడికల్ సిబ్బందికి ఐడెంటి కార్డు తప్పనిసరి.
9. గర్భిణీ స్త్రీలు మరియు అత్యవసర వైద్య సేవలు అవసరం ఉన్న వారు
10. ప్రయాణ టికెట్ కలిగిన ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ లకు వెళ్ళే ప్రయాణికులు
11. రాష్ట్రాంతర మరియు అంతరాష్ట్ర సరుకుల రవాణా
 
 
కోవిడ్ – 19 ను కట్టడి చేసేందుకు టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్ తప్పనిసరి అని, జిల్లా ప్రజలు ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను పాటిస్తూ కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సహకరించాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో 23 ఆక్సిజన్ ప్లాంట్ లను నెలకొల్పడమైందని, 2,646 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ లు ఆసుపత్రులలో, కోవిడ్ కేర్ సెంటర్లు, సెంట్రల్ డ్రగ్ స్టోర్ లలో అందుబాటులో ఉంచామన్నారు. 48 ఆసుపత్రులలో కోవిడ్ పేషెంట్ ల కొరకు 5,405 బెడ్ లను అందుబాటులో ఉంచామని, ఇందులో 723 ఐసియు బెడ్ లు ఉన్నాయన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: 18 to 31 at 11 p.m. From 5 p.m. Curfew enforcement until

Leave A Reply

Your email address will not be published.