Lakh crossing corona cases

24 గంటల వ్యవధిలో కొత్తగా 18522 కేసులు…418 మంది మృతి

Date:30/06/2020

న్యూ ఢిల్లీ  ముచ్చట్లు:

భారత్ లో సోమవారం నుండి మంగళవారం వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 18522 కేసులు నమోదయ్యాయి. ఇలాగే 418 మంది వైరస్  బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం కేసులు 566840కి మరణాలు 16893కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. ప్రస్తుతం మహమ్మారియాక్టివ్ కేసులు 215125 కాగా 334822 మంది బాధితులు చికిత్సతో కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మహమ్మారి కేసులు సంఖ్య వేలల్లో రికార్డ్ అవుతున్నాయి . మహారాష్ట్ర తమిళనాడు ఢిల్లీ ఉత్తరప్రదేశ్ గుజరాత్ తదితర రాష్ట్రాల్లో ప్రతిరోజు భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోనూ చాపకింద నీరులా మెల్లమెల్లగా ఈ  వైరస్ విస్తరిస్తున్నది. రాష్ట్రంలో మహమ్మారికేసులు విజృంభిస్తుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ని మరో నెల రోజుల పాటు పొడిగించింది. లాక్ డౌన్ ఈనెల30న ముగుస్తోండడంతో జూలై 31 వరకు లాక్ డౌన్ ని పొడిగిస్తున్నట్టు చీఫ్ సెక్రటరి కార్యదర్శి అజయ్ మెహతా ప్రకటించారు.

 

మహారాష్ట్ర బాటలోనే తమిళనాడు ప్రభుత్వం కూడా లాక్ డౌన్ ను పొడగిస్తునట్టు ప్రకటించింది. ఇదే బాటలో మరిన్ని రాష్ట్రాలు నడిచే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే లాక్ డౌన్ విధించి 100 రోజులు పూర్తీ కావడం ఆన్ లాక్ 1 పూర్తీ కావడంతో ..నేడు మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ  జాతిని ఉద్దేశించి ప్రసగించనున్నారు.  ఇప్పటికే  వైరస్ కట్టడికి కంటెయిన్ మెంట్ జోన్లలో జులై 31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్ లో భారీ పేలుడు

Tags: 18522 new cases … 418 people killed in 24 hours

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *