19న మాలమహానాడు విజయోత్సవ సభ
పుంగనూరు ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆదివారం మాలమహానాడు విజయోత్సవ సభ జరుగుతున్నట్లు సంఘ కార్యదర్శి ఎన్.ఆర్.అశోక్ తెలిపారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మదనపల్లె సీఎస్‌ఐ పంక్షన్‌హాల్‌లో మాలమహానాడు 25 సంవత్సరాల సంబరాలు జరుపుతున్నామన్నారు. ఈ మహాసభల్లో అనేక మంది ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని దళితులందరు ఈ మహాసభలో పాల్గొని, జయప్రదం చేయాలన్నారు. ఈ సమావేశంలో దళితనేతలు భాస్కర్, శీన, నాగరాజు, శ్రీనివాసులు, నాగరాజ తదితరులు పాల్గొన్నారు.

Tags: 19 Malamahanadu Vijayotsava Sabha
