19 నుండి నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి పవిత్రోత్సవాలు
తిరుపతి ముచ్చట్లు:
నాగలాపురం శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు నవంబరు 19, 20వ తేదీల్లో జరుగనున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. నవంబరు 19న ఉదయం ఆచార్య రుత్విక్ వరణం, సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ జరుగనుంది. నవంబరు 20న ఉదయం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో విశేషంగా స్నపన తిరుమంజనం చేపడతారు. ఆ తరువాత పవిత్ర సమర్పణ, రాత్రి పూర్ణాహుతి నిర్వహిస్తారు.

Tags: 19 to Nagalapuram Sri Vedanarayana Swamy’s Holy Festivals
