వేలం పాటల ద్వారా రూ:2.31లక్షలు ఆదాయం

Date:16/09/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

మండలంలోని చారాల, శెట్టిపేట పంచాయతీ పరిధిలోని చెర్వులు, కుంటల్లో చేపలు పెంచుకొను హక్కుపై బుధవారం జరిగిన వేలం పాటల ద్వారా రూ:2.31 లక్షలు ఆదాయం సమకూరినట్లు ఎంపీడీఓ శంకరయ్య తెలిపారు. యేడాది పాటు ఈ చెర్వులల్లో చేపలు పెంచుకొను హక్కుపై పోటా పోటీగా జరిగిన వేలంలో ఈ ఆదాయం సమకూరినట్లు తెలిపారు. చారాల పంచాయతీలో గల చెర్వులు, కుంటల ద్వారా నిర్వహించిన వేలంలో గాను రూ:1.84 లక్షలు, శెట్టిపేటలో 5 చెర్వుకు గాను రూ:47 వేలు ఆదాయం సమకూరినట్లు తెలిపారు. ఈ ఆదాయం గ్రామపంచాయతి బ్యాంకు ఖాతాకు జమ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లత తదితరులు పాల్గొన్నారు.

అందరి అభివృధ్దే ప్రభుత్వ లక్ష్యం

Tags: 2.31 lakh revenue from auction songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *