భారత్ లో క్రమంగా తగ్గుతూ వస్తున్న కరోనా మహమ్మారి జోరు 

Date:17/10/2020

న్యూ ఢిల్లీ ముచ్చట్లు

భారత్ లో కరోనా మహమ్మారి జోరు క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత కొద్దిరోజులుగా నమోదు అయ్యే కరోనా పాజిటివ్ కేసులు కూడా తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఇప్పటివరకు దేశంలో నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 74 లక్షలు దాటింది. తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 62212 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7432681కి చేరింది. నిన్న ఒక్క రోజే 837 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 112998 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు.నిన్న 6524596 మంది కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 795087గా ఉంది. కరోనా రోగుల రికవరీ రేటు 87.78 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.52 శాతానికి తగ్గింది. గడిచిన 24 గంటల్లో 999090 కరోనా టెస్టులు చేయగా ఇప్పటి వరకు మొత్తం 93254 017 టెస్టులు నిర్వహించారు.ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల్లో అమెరికా అగ్రస్థానం లో కొనసాగుతోంది. భారత్ బ్రెజిల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా తోలి స్థానానికి చేరగా … ఇండియా బ్రెజిల్ తర్వాతి పొజిషన్లలో ఉన్నాయి. మొత్తం మరణాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. బ్రెజిల్ ఇండియా తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.

 

గర్భిణి పట్ల మానవత్వాన్ని ప్రదర్శించిన హైదరాబాద్ మెట్రో

Tags:2 Corona epidemic is on the decline in India

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *