Natyam ad

2 రోజులుగా రోగులకు పస్తులు

కాకినాడ ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చివరికి రోగులకు కూడా అన్నం పెట్టలేని దౌర్బాగ్య స్థితికి చేరుకుంది. కోససీమలోని ప్రభుత్వాసుపత్రిలో  ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు భోజనం సరఫరా బంద్ అయ్యింది. దీంతో ప్రభుత్వాస్పత్రులలో రోగులు రెండు రోజులుగా పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది.నెలల తరబడి  భోజనం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా పెండింగ్ లో పెట్టడంతో వారు భోజన సరఫరా బంద్ చేసేశారు. కొనసీమలోని మొత్తం 11 ప్రభుత్వాసుపత్రుల్లోనే ఇదే పరిస్థితి.. లక్షల్లో బిల్లులు పెండింగ్ లో ఉండటంతో తామింక ప్రభుత్వాస్పత్రులకు భోజనాలు సరఫరా చేయలేమంటూ కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు.  కోనసీమ జిల్లా వ్యాప్తంగా మొత్తం 38లక్షల రూపాయలకు పైగా బిల్లులు బకాయిలు ఉన్నట్లు కాంట్రాక్టర్లు చెబుతున్నారు.భోజనాల సరఫరా నిలిచిపోవడంతో ఆస్పత్రుల్లో రోగులు నానా ఇబ్బందులూ పడుతున్నారు. జగన్ సర్కార్ నిర్వాకం వల్ల ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ పనులు అవి ఎంత చిన్నవైనా సరే చేయడానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఉంది. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడమే కాదు.. బిల్లుల గురించి అడిగితే బెదరింపులూ, దబాయింపులూ ఎదురౌతున్నాయని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా బిల్లులు పెండింగ్ లో పడి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన వారిలో వైకాపాకు చెందిన వారూ ఉన్నారు. డబ్బుల ఎగవేతలో జగన్ సర్కార్ కు తనా పరా బేధం లేదని అంటున్నారు. వాడుకోవడం.. ఆపై ఎంగిలి విస్తరాకులా విసిరేడం అనేది జగన్ సర్కార్ తీరుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఇక కోనసీమ ప్రభుత్వాప్పత్రుల్లో భోజన కాంట్రాక్టులకు సంబంధించిన బకాయిల విషయానికి వస్తే అత్యధికంగా అమలాపురం  ప్రభుత్వాసుపత్రిలో అత్యధికంగా 13 లక్షల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. అలాగే  రామచంద్రాపురంలో రూ. 9 లక్షలు, కొత్తపేటలో రూ. 6 లక్షలు, రాజోలులో రూ. 5 లక్షలు, అల్లవరం, కపిలేశ్వరంలో రూ. లక్ష, చొప్పున, ఆలమూరులో రూ. 91వేలు, ముమ్మడివరంలో రూ. 81వేల బిల్లులు నిలిచిపోయినట్లు కాంట్రాక్టర్లు చెబుతున్నారు.  కు భోజనాలు అందిస్తున్నాయి.

 

Tags: 2 days for the patients

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.