రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫి

2 lakh loan farmers at once

2 lakh loan farmers at once

Date:21/09/2018
అదిలాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ ను అడ్డగోలుగా దోచుకుంటున్న కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమికొట్టాలి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 10 స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుందని టీపీసీసీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం అయన అదిలాబాద్ లో పర్యటించారు.  ఉత్తమ్ మాట్లాడుతూ అన్ని వర్గాలను మోసం చేసిన కేసీఆర్ ను ప్రజలు తన్ని తరమాలి. అణచివేస్తూ పాలన సాగిస్తున్న కేసీఆర్ ను ప్రజలు ఇంకా సహించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ వుంటుందని అన్నారు.
17 రకాల పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తాం. 5 వేల కోట్ల రూపాయలతో మార్కెట్ స్థిరీకరణ ఫండ్ ఏర్పాటు చేస్తాం. పంటలకు రైతులకు భీమా ఉచితంగా ఇస్తామని అన్నారు. తెల్ల కార్డు ఉన్న పేదలకు 5 లక్షల రూపాయలు ప్రమాద భీమా కల్పిస్తాం. 1200 మన పిల్లలు తెలంగాణ కోసం త్యాగాలు చేశారు. అమరవీరులను కేసీఆర్ మర్చిపోయారు. అన్ని వర్గాల పేద పిల్లలకు ఫీస్ రియంబర్స్ మెంట్ అందిస్తాం. ఫీజ్ లు లేక ఏ పిల్లలు చదువులు ఆపుకోవద్దని అయన అన్నారు.
తెలంగాణ కోసం విద్యార్థులు త్యాగం చేస్తే వారి కోసం ఉద్యగాలు ఇవ్వకుండా వాళ్ళను అనేక బాధలకు గురి చేస్తున్న కేసీఆర్, తను, తన కుటుంబం మత్గ్రామ్ అత్యంత విలాస వంతమైన జీవితం గడుపుతున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలలో లక్ష ఉద్యోగాలు మొదటి ఏడాదిలోనే కల్పిస్తాం. ఇతర ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.  ఉద్యోగాలు రాని యువకులకు 3 వేల రూపాయల చొప్పున భృతి ఇస్తామని అన్నారు. 10 లక్షల మంది యువకులకు భృతి ఇస్తం.
గల్ఫ్ లో ఉన్న యువకులకు 5 లక్షల మందికి కూడా 5 లక్షల భీమా కల్పిస్తాం. 500 కోట్ల రూపాయలతో గల్ఫ్ నిధిని ఏర్పాటు చేస్తాం. పెన్షన్ లబ్ది దారులకు పెన్షన్ నగదును రెట్టింపు చేస్తామని అన్నారు. కుటుంబం లో అర్హులకు అందరికి, ప్రభుత్వ ఉద్యోగుల తల్లి తండ్రులకు కూడా పెన్షన్ ఇస్తాం. సన్న బియ్యం ఒకరికి 7 కిలోల చొప్పున అందిస్తాం. దళితులు, గిరిజనులకు ఉచితంగా అందిస్తాం. బియ్యం తోపాటు 9 రకాల ఇంటి సరుకులు అందిస్తాం.
మహిళలకు ఆర్థికంగా బలపరచడానికి ప్రోత్సహకలు అందిస్తాం. రాష్ట్రంలో ఉన్న 6 లక్షల గ్రూపులకు లక్ష రూపాయల గ్రాంట్ ఇస్తాం. ప్రతి గ్రూప్ లలో వడ్డీ లేని రుణాలు అందిస్తాం. ఇందిరమ్మ పాత ఇళ్లకు ఆదనపు గది నిర్మాణానికి 2 లక్షల రూపాయలు ఇస్తాం. కొత్త ఇళ్లకు 5 లక్షల రూపాయల తో కట్టిస్తామని అన్నారు.
Tags:2 lakh loan farmers at once

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *