సిటీలో 2 నెల్లో 2 వేల కిలోమీటర్లు

Date:09/10/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
హైద్రాబాద్ నగర రహదారులను అద్దంలా అభివృద్ధి పరచాలని జిహెచ్‌ఎంసి ప్రణాళికలను సిద్ధం చేసింది. అందులో భాగంగా ముందుగా 2 వే ల కి.మీ.ల రోడ్లను ఎంపిక చేసింది. ఈ రహదారుల్లో ఫుట్‌పాత్‌ల నిర్మాణం, గుంతల రహిత రహదారులుగా తీర్చిదిద్దడం, నిర్వాహణను మరింత మెరుగ్గా చేయడం, నో ఓపెన్ మ్యాన్‌హోల్ పద్ధ్దతిని కచ్చితంగా అమలుపరచాలని కమిషనర్ దానకిషోర్ అధికారులను ఆదేశించారు. నగర రహదారులపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగిపోవాలని, ఆధునికత ఉట్టిపడేలా ఉండాలని జిహెచ్‌ఎంసి నిర్ణయించింది. ఈ మేరకు శనివారం జలమండలి, జిహెచ్‌ఎంసి అధికారులు సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమై రహదారుల రూపురేఖలు మార్చేందుకు అనుసరించాల్సిన పద్దతులపై సమగ్రంగా చర్చించారు.
రోడ్ల నిర్వాహణ, పారిశుధ్ద కార్యక్రమాలను మరింత మెరుగ్గా చేపట్టాల్సిన అవసరమున్నదని కమిషనర్ దానకిషోర్ అధికారులను ఆదేశించారు.నగరంలో చేపట్టిన రోడ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తిచేయని కాంట్రాక్టర్లకు నిబంధనలను అనుసరించి జరిమానాలను విధిస్తున్నట్టు జిహెచ్‌ఎంసి కమిషనర్ దానకిషోర్ ప్రకటించారు. ఇప్పటికే జిహెచ్‌ఎంసి చరిత్రలో మొదటిసారిగా టెండర్ ఒప్పందం ప్రకారం సకాలంలో రోడ్డు నిర్మాణ పనులను పూర్తిచేయని కాంట్రాక్టర్లకు రూ. 35 లక్షలను జరిమానాగా విధించినట్టు కమిషనర్ వివరించారు. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో నిర్వాహణ, కార్యకలాపాల పనులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తించదని కమిషనర్ పేర్కొన్నారు.
ఎంపిక చేసిన 2 వేల కి.మీ.ల రోడ్లలోని ఘన వ్యర్థాలు, భవన నిర్మాణ వ్యర్థాలు, గార్బేజ్, రాళ్ళు, రప్పలను కేవలం రెండు నెలల్లోనే పూర్తిగా తొలగించాలని అధికారులనకు స్పష్టంగా ఆదేశాలు జారీచేశారు. నగరంలో 985 కి.మీ.లు మేర మూడులేన్‌లు, ఆరులేన్‌లుగా రోడ్లున్నాయి. వీటితో పాటు బస్సులును రాకపోకలు సాగించే ప్రధాన రహదారులన్నిటిని నో కాంప్రమైజ్‌గా రహదారులుగా గుర్తిస్తున్నట్టు కమిషనర్ ప్రకటించారు. నగరంలోని అత్యంత కీలకమైన రహదారులపైన ఏవిధమైన భవన నిర్మాణ, మునిసిపల్ వ్యర్థాలను వేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని దానకిషోర్ సూచించారు.
అయితే, ముందుగా రోడ్ల శుభ్రంగా ఉండేందుకు స్థానిక నగరవాసుల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలతోపాటు జలమండలి వద్ద ఉన్న 44 ప్రత్యేక వాహనాలను రోడ్ల నిర్వాహణకు ఉపయోగించుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు.గ్రేటర్ పరిధిలో 2 వేల కి.మీ.లు రోడ్లను మెరుగ్గా ఉంచడంతో పాటు 500 బస్తీలను, వెయ్యి ప్రధాన ప్రాంతాలను ఎంపిక చేసి వీటిల్లో పారిశుధ్ద కార్యక్రమాలను మరింత మెరుగ్గా నిర్వహించాలని కమిషనర్ వెల్లడించారు.
ఎస్సి, ఎస్‌టి కాలనీలు, బస్తీల్లో మౌలిక సదుపాయాలన అభివృద్ధి చేపట్టడానికి సబ్‌ప్లాన్ నిధులు అందుబాటులో ఉన్నందున వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు. బస్టాండులు, ఆసుపత్రులు, మాల్స్ ఇతర కీలక కార్యాలయాలను ఉన్న వెయ్యి ప్రాంతాలను గుర్తించాలని జిహెచ్‌ఎంసి, జలమండలి అధికారులకు సూచించారు. వచ్చే నాలుగైదు నెలల్లోనే నగర రోడ్ల ముఖచిత్రంలో స్పష్టమైన మార్పు కనిపించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.
Tags:2 thousand kilometers in the city in 2 months

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *