20 కోట్ల రిజిస్ట్రేషన్ ఆదాయం

Date:23/02/2021

ఖమ్మం ముచ్చట్లు:

నాలుగు నెలల క్రితం బంద్‌ అయిన వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు.. గత ఏడాది డిసెంబర్‌లో మళ్లీ మొదలయ్యాయి. రిజిస్ట్రషన్లు మొదలైన ఈ 60 రోజుల వ్యవధిలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. 60 రోజుల రిజిస్ట్రేషన్లు ఒక ఎత్తయితే గడిచిన నాలుగు రోజుల్లో జరిగిన రిజిస్ట్రేషన్లు ఒక ఎత్తు. మొత్తంగా 2160 వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు కాగా.. ప్రభుత్వానికి రూ.6 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో భూముల క్రయ, విక్రయాలు తిరిగి ప్రారంభయ్యాయి. రియల్‌ వ్యాపారం గాడిలో పడడం, రిజిస్ట్రేషన్లు సైతం జోరుగా కొనసాగడంతో ప్రభుత్వానికి భారీ ఆదాయం చేకూరింది. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లను పాత పద్ధతిలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో చేసేందుకు ప్రభుత్వం అదేశించడంతో రూరల్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జోరుగా సాగుతున్నాయి. గత ఏడాది డిసెంబర్‌ 14 నుంచి కార్డు (కంప్యూటర్‌ ఎయిడెడ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌) విధానంలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనలను సైతం ఎత్తియేడంతో పెండింగ్‌ ఉన్న ప్లాట్లు, ఇండ్ల రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. ప్రభుత్వం వ్యవసాయేతర భూములన్నింటినీ నిబంధనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశించింది. అయితే రిజిస్ట్రేషన్ల జోరు మొదలుకావడంతో ఆ కార్యాలయమే కేంద్రంగా కొందరు రియల్‌ వ్యాపారులు తమ అక్రమ రిజిస్ట్రేషన్లను సక్రమం చేసుకునే పనిలో పడ్డారని రియల్‌ వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

 

 

 

ప్రభుత్వ కార్యాలయాన్నే తమ సొంత రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయంగా మార్చుకున్న ముగ్గురు రియల్‌ వ్యాపారులు లింకు డాక్యుమెంట్లు లేకుండానే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకుని తమ పనిని పూర్తి చేసుకున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఈ వ్యవహారంలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో కీలకంగా పని చేసే ఉద్యోగుల నుంచి, మధ్యవర్తులకు వ్యవహరించే వారి వరకు ఈ రియల్‌ వ్యాపారులు భారీగా ముట్టచెప్పినట్లుగా ఆరోపణలొస్తున్నాయి. వందల మంది రియల్‌ వ్యాపారులు ఉండగా ముగ్గురు నలుగురికి చెందిన ప్లాట్లు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుతున్నాయని మిగతా వ్యాపారులు వాపోతున్నారు. లింకు డాక్యుమెంట్లు లేని కొత్త ప్లాట్లకు కూడా రిజిస్ట్రేషన్లు చేసినట్లు సమాచారం.

వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags: 20 crore registration income

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *