జగిత్యాల ప్రెస్ భవన్ కు 20 గుంటల స్థలం 

Date:27/01/2021

జగిత్యాల  ముచ్చట్లు:

జగిత్యాల ప్రెస్ భవన నిర్మాణానికి 20 గుంటల స్థలం కేటాయించాలని కోరుతూ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీ. జీవన్ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు చర్యలు తీసుకోవాలని కోరుతూ జగిత్యాల కలెక్టర్ కు ప్రభుత్వం లేఖ రాసింది. చాలా కాలంగా జగిత్యాల జిల్లా పాత్రికేయులు ప్రెస్ భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జగిత్యాల జిల్లా ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి స్థల పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ కు ప్రభుత్వం లేఖ రాయడం పట్ల జగిత్యాల జిల్లా జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ. 10 ల‌క్ష‌లు విరాళం

Tags: 20 holes for Jagittala Press Bhavan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *