బన్నీ ఉత్సవ మృతులకు 20 లక్షలు ఎక్స్ గ్రేషియ, 5 ఎకరాల పొలం ఇవ్వాలి

ఉత్సవ నిర్వాహకుల పైన మర్డర్ కేసు బుక్ చేయాలి
ప్రేక్షక పాత్ర పోషించిన పోలీసులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలి
-డివైఎఫ్ఐ

కర్నూలు ముచ్చట్లు:

 

అలూరు నియోజకవర్గం లో అక్టోబర్ 25 బుధవారం రోజు ఉదయం బన్నీ ఉత్సవంలో ముగ్గురు మరణించడం బాధాకరమని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్, జిల్లా ఉపాద్యక్షుడు సురేష్ నాయకులు రామేష్ విలేకరుల సమావేశంలో తెలిపారు. తక్షణమే మృతులు గణేష్ (19) రామాంజనేయులు (59) ప్రకాష్ (30) కుటుంబాలకు 20 లక్షల ఎక్స్గ్రేషియా 5 ఎకరాల దేవాదాయ భూమి ఇవ్వాలి  సరైన చర్యలు తీసుకోకుండా 100 మంది కి గాయాలు ముగ్గురు ప్రజల ప్రాణాలు పోయేలాగా ఉత్సవాన్ని నిర్వహించిన *ఉత్సవ నిర్వాహకుల పైన మర్డర్ కేసు బుక్ చేయాలి మీడియా వాహనాలను ధ్వంసం చేస్తున్న ప్రజల ప్రాణాలు పోయేలాగా ప్రజలు కిక్కిరిసిపోయిన ప్రేక్షక పాత్ర పోషించిన పోలీస్ అధికారుల పైన శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలు పోకుండా ప్రజలందరూ ఆనందంగా సంతోషంగా నిర్వహించుకునే ఉత్సవాలు నిర్వహించాలి తప్ప హింసను ప్రేరేపించే ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే ఉత్సవాలను ప్రజల్లో మూడత్వాన్ని పెంచి పోషించే ఉత్సవాలను అరికట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. వేలాదిమంది పాల్గొనే ఈ ఉత్సవంలో ప్రతి సంవత్సరం  ప్రజలకు భారీ గాయాలు కావడం ప్రాణ నష్టం జరగడం జరుగుతున్న ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగే హింసను తగ్గించడంలో ఘోరంగా వైఫల్యం చెందుతున్న నిర్వాహకుల పైన మర్డర్ కేసు బుక్ చేయడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా ప్రజలను ప్రభుత్వ యంత్రాంగం నిర్వాహకులు చైతన్యవంతం చేస్తారని తెలిపారు.. వేల మంది పోలీసులు బన్నీ ఉత్సవంలో పాల్గొని ప్రేక్షక పాత్ర పోషించి ప్రజలను కంట్రోల్ చేయడంలో ప్రజల ప్రాణాలు కాపాడడంలో శాంతి భద్రతలను కాపాడడంలో మూఢనమ్మకాలను తగ్గించడంలో ఘోరంగా వైఫల్యం చెందిన  పోలీసు అధికారులపై, రెవెన్యూ అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారీగా ఆదాయం ఉన్న దేవస్థాన కమిటీ నుండే మరణించిన కుటుంబాలకు  ఎక్స్గ్రేషియా 5 ఎకరాల పొలము ఇప్పించాలని డిమాండ్ చేశారు. బన్నీ ఉత్సవంలో మృతి చెందిన ముగ్గురికి సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.

 

Post Midle

Tags:20 lakhs ex gratia and 5 acres of land to be given to the dead of Banni Utsava

Post Midle